Site icon Prime9

Horoscope: 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

daily horoscope details

daily horoscope details

Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయని తెలుస్తుంది. అలాగే జూలై 9వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం: నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులు మంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితి, దాంపత్య జీవితం చాలావరకు అనుకూలంగా ఉంటాయి.

వృషభం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం: ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు.

కర్కాటకం: కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. చేపట్టిన కార్యక్రమాలు వేగంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. తోబుట్టువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి.

సింహం: నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు.

కన్య: అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి లేదా ధన వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారానికి కొత్తగా పెట్టుబడులు ముందుకు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో చేరడానికి ఆఫర్ అందుతుంది.

తుల: వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్య తలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది.

వృశ్చికం: కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు, ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రయాణాలలోనూ, ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు: వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

మకరం: వృత్తి, వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చాలావరకు సానుకూల పడతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా, అన్యోన్యంగా సాగిపోతుంది.

కుంభం: వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగావకాశాలు అందుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.

మీనం: వృత్తి, ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయానికి సంబంధించి, జీత భత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.

 

Exit mobile version