Site icon Prime9

Daily Horoscope: నేటి రాశిఫలాలు 02 జూలై 2023 పూర్తి వివరాలు

daily horoscope details

daily horoscope details

Daily Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయని తెలుస్తుంది. అలాగే జూలై 2వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం: ముఖ్యమైన వ్యక్తిగత పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువుల నుంచి మంచి శుభవార్త వింటారు. మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభం: ఆస్తి, ఆదాయానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆస్తి విలువ పెరిగే సూచనలు ఉన్నాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా, అదనపు ఆదాయ ప్రయత్నాల పరంగా ఆదాయం పెరగడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కుటుంబ పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతుంది.

మిథునం: కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణ యాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. కార్యసిద్ధి, వ్యవహార విజయం వంటివి అనుభవానికి వస్తాయి.

కర్కాటకం: ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొత్తం మీద ప్రోత్సాహకారంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.

సింహం: ఈ రాశి వారు పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. ఉద్యోగ జీవితంలో టెన్షన్లు, ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది.

కన్య: ఆదాయం పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

తుల: అన్ని విషయాలలోనూ అభివృద్ధి కనిపిస్తోంది. అనుకున్న పనులు అవుతాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది.

వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి ఇప్పట్లో అవకాశం లేదు. దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు.

ధనుస్సు: ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది సంతృప్తికరంగా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది.

మకరం: వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం ఉంటుంది. ప్రమోషన్ కు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆస్తి వివాదం చాలావరకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

కుంభం: ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా బాగా తగ్గటం జరుగుతుంది. పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల విషయంలో సంతృప్తికరంగా ముందుకు వెళతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం, అన్యోన్యత పెరుగుతాయి.

మీనం: సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాలలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరగటం వల్ల ఇబ్బంది పడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంది.

Exit mobile version