Horoscope Today: నేడు పలు రాశుల వారికి ఉద్యోగ విషయంలో గౌరవ మర్యాదలు ఉండనున్నాయి. ఈ రాశుల వారి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వేరే రాశుల వారు పలు విషయాల్లో శుభవార్త విననున్నారు.
మేషం: నేడు ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు ఉంటాయి ఆదాయం నిలకడగా ఉంటుంది.
ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ముఖ్యమైన పనుల్లో మిత్రులు సహాయపడతారు. శుభవార్త వింటారు.
విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
వృషభం: మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు పర్వాలేదు.
మిథునం: కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర వెళ్లే ఆలోచన చేస్తారు. ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉంటుంది, ఉద్యోగంలో మీకు హోదా పెరిగే అవకాశం ఉంది.
వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పెళ్లి సంబంధం విషయంలో కొద్దిగా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తాయి.
ఈ రాశివారికి ఆదాయం (Horoscope Today)
కర్కాటకం: ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు అదుపు తప్పడం వల్ల ఇబ్బంది పడతారు. ఇస్తానన్న డబ్బుని వాయిదా వేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి.
శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది.
సింహం: ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరిగే సూచనలున్నాయి.
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
కన్య: ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఇంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉంటాయి.
వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఐ టి తదితర వృత్తి నిపుణులకు సమయం చాలా బాగుంది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది.
ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
తుల: ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.
అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోతారు. పొదుపు సూత్రాలను పాటిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.
వృశ్చికం: ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి లోపిస్తుంది.
బంధువులతో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సహాయంగా ఉంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి తలెత్తుతుంది.
ధనుస్సు: ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ కాస్తంత ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది.
ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం వల్ల మంచి జరుగుతుంది. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వీటికి దూరంగా ఉండండి
మకరం: ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు పూర్తి చేస్తారు. పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
తోబుట్టువులకు వీలైనంతగా సహాయపడతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది.
వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
కుంభం: శక్తికి మించి ఇతరులకు సహాయపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది.
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు.
ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తికి దారితీస్తాయి.
మీనం: ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. దూరపు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది.