Site icon Prime9

Ganesh Chaturthi : బొజ్జ గణపయ్య గురించి తెలుకుందాం

bojja ganapayya prime9news

bojja ganapayya prime9news

Ganesh Chaturthi: పార్వతీ దేవి చేసిన చిన్న పసుపు ముద్దతో సృష్టించి రోజును గణేశుని జన్మించిన రోజుగా భావించి ఆ రోజు వినాయకునిచవితి పండగ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు పండగను గణంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండగ హిందువుల పండగల్లో ముఖ్య మైన పండుగలలో ఇది కూడా ఒక పండగ .పార్వతి, పరమేశ్వరుల చిన్న కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే అందరూ కలిసి వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి నాడు మధ్యాహ్న సమయంలో హస్త నక్షత్రమందు ఈ చవితి పూజలు చేసి ఉత్సవాలను ప్రారంబిస్తారు. వినాయక చవితి రోజునే గౌరీ గణేష్ పండగ కూడా చేస్తారని మనలో కొంత మందికి తెలీదు అలాగే చవితి ముందు రోజు ఆడవాళ్ళు గౌరీ దేవతకు పూజలు కూడా చేస్తారు.

వినాయక చవితి రోజు: సిరి సంపదలు, జ్ఞానం,గొప్పతనం,మంచి ఆరోగ్యం,చదువు వంటి మంగళప్రదాలను గణేశుడు మనకు ప్రసాదిస్తాడు.ఈ పండుగను పల్లెటూరిలో, పట్టణాల్లో వీధి వీధిలో వినాయకుని విగ్రహం పెట్టి మన హింధు సాంప్రదాయాల ప్రకారం ఒక రోజు,మూడు రోజులు,ఏడు రోజులు,పది రోజులు,పడుకొండు రోజులు,పదమూడు రోజులు, పదిహేను రోజులు, పదిహేడు రోజులు,ఇరవై ఒక్క రోజులు నిత్య పూజలు చేస్తూనే ఉంటారు.

గౌరీ గణేష్ :మనలో కొంతమంది ఐతే ఆ రోజున గణేశున్ను , గౌరీ దేవిని ఇంటికి తీసుకొచ్చి గౌరీ విగ్రహాలను కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ దేవిని, చదువుల సరస్వతి దేవిని వినాయకుడి అక్కలుగా భావించి వారికి నిత్య పూజలు చేస్తూనే ఉంటారు. వారిని దుర్గాదేవి పిల్లలుగా భావిస్తారు. కొందరు ఐతే లక్ష్మీ, సరస్వతి గణేశుల ఇద్దరు భార్యలుగా అనుకుంటారు .మనలో సిద్ధి, బుద్ధి అని రెండు రకాల వాళ్ళు ఉంటార. ఒక విధంగా చెప్పాలంటే వారు ఇలా అనుకోవడం వారి బిన్న అభిప్రాయాలు కారణం అని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ పండుగను గౌరీ గణేష పండుగగా అందరూ జరుపుకుంటారు.

గౌరీ చతుర్థి : గౌరీ గణేష్ పండుగ ముందు రోజు గౌరీ దేవిని దేవతగా భావించి ఆడవాళ్ళు ప్రత్యేక పూజలు చేయడం ఆచారంగా వస్తుంది . ఆ రోజు గౌరీ అమ్మ విగ్రహాన్ని పసుపుతో నిండుగా అలంకరించి బియ్యం లేదా వడ్ల ధాన్యాల కలశంలో ఉంచి పూలు, పండ్లు గౌరీ అమ్మ వారికి సమర్పించి పూజలు చేస్తారు . తరువాత రోజు గణేశుడిని విగ్రహం పెట్టి పూజలు ప్రారంబిస్తారు. పెళ్ళి ఐన ఆడవాళ్ళు గౌరీ దేవతను పూజిస్తే చాలా మంచిది.

Exit mobile version