Devotional News : సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషించేది డబ్బు. పేద, మధ్య తరగతి, ధనిక అంటూ తారతమ్యాలు ఉన్నప్పటికీ అందరికీ ప్రధాన అవసరం డబ్బే. ప్రస్తుత కాలంలో మనిషి మనుగడలో డబ్బు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. మంచి తిండి, మంచి చదువు, మంచి ఆరోగ్యం… వగైరా ఏ అవసరాన్ని తీర్చుకోవడానికైనా కావలసింది డబ్బే. అయితే డబ్బును తీసుకోవాలన్న, ఇవ్వాలన్నా కూడా ఒకటి రెండు సార్లు లెక్కబెట్టుకొని ఇస్తాం లేదా తీసుకుంటాం. ఇక వ్యాపారం చేసే వారు ప్రతిరోజూ వందలు, వేల, లక్షల సంఖ్యలో కరెన్సీ నోట్లను లెక్కపెడుతూ ఉంటారు.
పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదకు ప్రతీకగా పరిగణిస్తారు.
అయితే అలా డబ్బులను లెక్కించే సమయంలో చాలా మంది తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు.
అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అందుకే దడబ్బును లెక్కించేతప్పుడు కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
ఆ విధంగా చేస్తే ఇంట్లో ఇక డబ్బుకు కొదువ ఉండదని అంటున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
ఎలా లెక్కబెట్టాలంటే…
డబ్బును లెక్కబెట్టేటప్పుడు సాధారణంగా డబ్బును ఒక చేత్తో పట్టుకొని రెండో చేతిలోకి తీసుకుంటూ లెక్కిస్తాము. అయితే అలా లెక్కించేటప్పుడు డబ్బును మన నుంచి బయటకు వెళ్ళేలా లెక్కబెడతాం. అయితే అలా కాకుండా డబ్బును మధ్యకి మడిచి లెక్కబెట్టడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చని అంటున్నారు.
అలాగే మనలో చాలా మంది డబ్బులను లెక్కించేటప్పుడు నోట్లో నాలుకతో వేలిని తడిమి, ఆ తర్వాత కరెన్సీ నోట్లను లెక్కిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుందట. దీంతో మీకు ఇబ్బందులు పెరుగుతాయట. కాబట్టి నోట్లను లెక్కించేటప్పుడు పక్కన ఒక చిన్న ప్లేటులో లేదా గ్లాసులో నీరు ఉంచుకుని, వాటిని తాకుతూ నోట్లను లెక్కించొచ్చు.
ఎక్కడ లెక్కబెట్టాలంటే…
అదే విధంగా నగదు సొమ్మును కేవలం శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంచాలి. వాటికంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది కాబట్టి అక్కడే ఉంచాలి. కొంచెం శుభ్రంగా ఉండే ప్రదేశంలో డబ్బును లెక్కించడం మంచిది. ఇక పొరపాటున డబ్బులు కిందకి జారిపడిపోతే, వాటిని తీసుకునేటప్పుడు లక్ష్మీదేవిని తలచుకుని కళ్లకద్దుకుని తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలానే రాత్రి వేళలో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులను నిద్రించే మంచంపై పెట్టకూడదు. అలాగే మీతో ఉండే నగదు సొమ్మును కేవలం శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంచాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి…
Byreddy Siddharth Reddy: జగన్ ప్రైవేట్ సైన్యం.. అందరినీ లేపేస్తాం జాగ్రత్త- బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
Hanuman: పదకొండు భాషల్లో హనుమాన్ మూవీ.. సమ్మర్‌లో సందడే ఇక
Akhilesh Yadav: “టీ”లో విషం కలిపారేమో.. పోలీసులు ఇచ్చిన టీ తాగనన్న అఖిలేష్ యాదవ్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/