Site icon Prime9

Devotional News : పూజ సమయంలో పుష్పాలను ఎందుకు ఉపయోగించాలి.. ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజించాలంటే..?

devotional news about flowers using for pooja

devotional news about flowers using for pooja

Devotional News : హిందూ ఆచారాల ప్రకారం దేవునికి పూజ చేయడం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు. పూజ కి పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీత లో భోదించారు. అయితే పూజ సమయంలో పుష్పాలను ఎందుకు ఉపయోగించాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి వారి కోసం పుష్పాల గురించి స్పెషల్ స్టోరీ మీకోసం..

పూజకి ఉపయోగించే పుష్పాలు ఎలా ఉండాలంటే (Devotional News)..

దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి, శుభ్రతతో కూడుకున్నదై వుండాలి.

పురిటివారు, మైలవారు బహిష్టులైన స్త్రీలు పుష్పాలను తాకరాదు.. అలాంటివి పూజకు పనికిరావు.

భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది.

శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి.

వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగించకూడదు.

 

 

(Devotional News)ఎవరిని ఏ పువ్వులతో పూజిస్తే మంచిదంటే..?

మహా శివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. అలాగే పవళ మల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోర్కెలు, మంచి ఆలోచనలు వస్తాయట.

విష్ణు భగవానుడిని తులసి దళాలతో.. శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో పూజించాలి.

సూర్యుడుని, వినాయకుడిని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించడం మంచిది.

గాయత్రి దేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలి.

‘శ్రీచక్రాన్ని’ తామర పువ్వులు, తులసి దళాలు, కలువ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువ పూలు, గురువింద పుష్పాలతో పూజించాలి.

శ్రీ మహాలక్ష్మికి ఎర్ర పుష్పాలు ప్రీతికరం.. ఈ పుష్పాలతో పూజవల్ల శ్రీమహాలక్ష్మి సంతుష్టురాలై, అభీష్ట సిద్ధినిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అదే విధంగా తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు.

కంఠాన గంధాన్ని, చెవిలో పుష్పాన్ని ధరించాలట. జుట్టు ముడిలో తులసిదళాన్ని ధరించరాదట.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version