Devotional News : హిందువుల పండుగలలో హొలీ కూడా ముఖ్యమైనది. ప్రతి ఏడాది పాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఈ పండగను జరుపుకుంటారు. కాగా ఈ సంవత్సరం ఈ నెల 8వ తేదీన హొలీ పండుగ జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఈ పండుగ జరుపుకునేందుకు పిల్లలు ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుంటూ ఎంత ఆహ్లాదంగా గడుపుతారు. అయితే హొలీ పండగ జరుపుకునే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ నియమాలను పాటిస్తూ ఇంట్లో వాస్తు దోషాలు , ఆర్ధిక ఇబ్బందులు, తొలగి.. సంతోషంగా ఉంటామని చెబుతున్నారు.
పాజిటివ్ ఎనర్జీ కోసం (Devotional News)..
ఇంట్లోని దోషాలు తొలగించుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి హోలీ రోజున.. మొక్కలను నాటడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా మొక్కను పెంచడం వలన ఆ ఇంట్లో ఏడాది పొడవునా సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. వ్యాపారాభివృద్ధికి, ధన లాభానికి హొలీ రోజున ఇంట్లో ప్రకృతి అందాన్ని ప్రతిభింబించే తూర్పున ఉదయించే సూర్యుడు చిత్రాన్ని పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు.
(Devotional News) వినాయక పూజ..
హోలీ పండుగ రోజున ముందుగా వినాయకుడిని పూజించి.. అనంతరం కుటుంబ సభ్యులు హోలీని జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన ఆ ఇంటి సభ్యుల మీద గణేశుడు అనుగ్రహం ఉంటుందంటున్నారు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఎటువంటి విఘ్నాలు జరగకుండా పని విజయవంతంగా పూర్తి అయ్యేలా వినాయకుడి అనుగ్రహం ఉంటుందని తెలిపారు. పూజ సమయంలో గులాబీ రంగుని గణేశుడికి అద్ది.. అనంతరం నైవేద్యంగా స్వీట్లను సమర్పించాలని తెలిపారు.
అదే విధంగా హొలీ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, రాధా కృష్ణలను ప్రత్యేకంగా పూజించాలి. హొలీ సంబరాలను ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా ఇంటి ప్రాంగణంలో జరుపుకోవడం మేలు జరుగుతుంది. అంతేకాదు హొలీ సమయంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులను ఎంచుకోవాలి. హొలీ సంబరాలు ఇంటి ప్రాంగణంలో జరుపుకుంటే.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వెల్లడిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/