Site icon Prime9

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు ఏ సమయానికి బంగారం కొనుగోలు చేస్తే మంచిదో తెలుసా..?

devotional news about akshaya tritiya pooja and timings

devotional news about akshaya tritiya pooja and timings

Akshaya Tritiya : హిందూ మత ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ పర్వదినానికి విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. కాగా హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ పవిత్రమైన రోజున చేసే పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు.  పూజిస్తారు. అదే విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు బంగారం కొనుగోలు చేయడం కూడా మంచి సంప్రదాయంగా పాటిస్తారు. ఈ విధంగా చేస్తే ఏడాది పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ 22 ఏప్రిల్ 2023 నాడు వచ్చింది. ఈ మేరకు అక్షయ తృతీయ రోజు ఏ విధంగా పూజ చేయాలి.. ఏ సమయానికి బంగారం కొనుగోలు చేస్తే మంచిది.. వంటి విషయాలు మీకోసం ప్రత్యేకంగా..

అక్షయ తృతీయ శుభ సమయం..

అక్షయ తృతీయ శుభ సమయం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి, నారాయణుని ఆరాధించడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పంచాంగం ప్రకారం, కలశ పూజకు అనుకూలమైన సమయం ఏప్రిల్ 22, 2023 ఉదయం 07:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. పూజ సమయం మొత్తం 04 గంటల 31 నిమిషాల పాటు ఉంటుంది.

అక్షయ తృతీయ రోజు ఎవరిని పూజించాలి..

మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవితో పాటు విష్ణువు, కృష్ణుడు , గణేశుడిని పూజించడం కూడా ప్రయోజనకరం.

అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిదంటే Akshaya Tritiya ..

గంగాస్నానం, దానం, పూజలు కూడా ముఖ్యమైనవి. ఆస్తికి సంబంధించిన పనులు చేయడం, గృహ ప్రవేశం మొదలైన శుభ కార్యాలు ఈ తేదీన చేయవచ్చు.

అక్షయ తృతీయ రోజు పూజ విధానం..

Exit mobile version