Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ప్రేమ వ్యవహారాల్లో మంచి జరుగుతుందని తెలుస్తుంది. అలాగే మార్చి 9 వ తేదీ నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మేషం..
ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ఆశాభావంతో ఉన్న ఒక పెళ్లి సంబంధం నిరుత్సాహం కలిగిస్తుంది. టీచర్లకు, కళాకారులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఐటీ వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
వృషభం..
వ్యవసాయదారులకు, సామాజిక రంగంలోని వారికి అనుకూల కాలం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రేమలు ఫలిస్తాయి.
మిథునం..
తోబుట్టువుల వల్ల విభేదాలు తలెత్తుతాయి. కుటుంబ పరంగా ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. దూరప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
కర్కాటకం..
వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు గడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకు వెళతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధు వర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.
సింహం..
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. రుణ సమస్యలను చాలా వరకు తగ్గించుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. పెళ్లి సంబంధం ఒకటి నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మందకొ డిగా సాగుతాయి. డబ్బు జాగ్రత్త.
కన్య..
చిన్న వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ నాయకులకు సమయం అన్ని విధాలుగాను బాగుంటుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
తుల..
ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యలను తగ్గించుకుంటారు. ఉద్యోగంలోనూ, బంధువర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.
ఈ రాశి వారికి కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుందని తెలుసా (Daily Horoscope)..
వృశ్చికం..
ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. డబ్బు మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగం ఆశాజనకంగా ఉంటుంది. పురోగతికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు..
వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తోంది. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా మారుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు పెడతారు. డబ్బు జాగ్రత్త.
మకరం..
చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వారు ఆర్థికంగా బాగా ప్రయోజనం పొందుతారు. ఇతర ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రుణ బాధ చాలావరకు తగ్గుతుంది. విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
కుంభం..
రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇష్టమైన వాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరు దగ్గర బంధువులను ఆదుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడటం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం..
ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధు వర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/