Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిదని సూచన..!

daily horoscope details of different signs on october 26 2023

daily horoscope details of different signs on october 26 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిదని సూచన. అలాగే సెప్టెంబర్ 6 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు గడిస్తారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. మంచి స్నేహితులు ఏర్పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ ఆలోచనలకు, వ్యూహాలకు విలువ పెరుగుతుంది. వివాదాలు, సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృషభం..

పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం, సామరస్యం పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావలసిన డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది.

మిథునం..

ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం..

బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి.

సింహం..

రాజకీయాల్లో ప్రవేశించేవారికి సమయం అనుకూలంగా ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరికీ ఆకట్టుకుంటారు. వృత్తి రంగంలో మీరను కున్నది సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కన్య..

కొత్తవారితో స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు ఇబ్బందులు తలెత్తవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.

తుల..

పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మీ ఆలోచనలు, వ్యూహాలు విజయవంతం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తి కరంగా, సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి.

వృశ్చికం..

ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సాను కూలపడతాయి. పిల్లల చదువుల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు.

ధనస్సు..

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. శత్రువులు కూడా మిత్రు లుగా మారుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి రంగంలో మంచి గుర్తింపు లభించి సంపాదన పెరుగుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం..

ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు.

కుంభం..

వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తి స్తారు. దైవ కార్యాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలున్నాయి.

మీనం..

ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరు ద్యోగుల ప్రయత్నాలే కాక, అవివాహితుల ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి.

Exit mobile version