Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉందని తెలుసా..!

daily horoscope details of different signs on october 27 2023

daily horoscope details of different signs on october 27 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 29 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా శుభవార్తలు అందుతాయి. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం కూడా చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవా లేదు.

వృషభం..

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలతో పాటు, ఆఫీసు నుంచి రావలసిన బకాయిలు కూడా చేతికి అందుతాయి. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

మిథునం..

వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. అలానే ప్రయాణాలు కూడా తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కర్కాటకం..

కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారం స్థిరంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలు రొటీన్ గా సాగిపోతాయి.

సింహం..

వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం అందుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు.

కన్య..

ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

తుల..

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. రాదనుకుని మొండి బాకీ వసూలు అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ విషయాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం..

ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఒక విషయంలో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను ఇస్తారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

ధనస్సు..

ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం..

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. సమాజంలోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రులకు బాగా అండగా నిలబడతారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

కుంభం..

వృత్తి, వ్యాపారాల్లోనే కాకుండా కుటుంబ విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది.

మీనం..

ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబంతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గుర్తింపు ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

Exit mobile version