Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారి జీవిత భాగస్వామికి అదృష్టం పట్టవచ్చని తెలుసా..

daily horoscope details of different signs on october 25 2023

daily horoscope details of different signs on october 25 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి జీవిత భాగస్వామికి అదృష్టం పట్టవచ్చని తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 11 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల మీద దృష్టిపెడతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

వృషభం..

వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి కంపెనీల నుంచి కీలక సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మిథునం..

కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలు, ఆలోచనలకు ప్రోత్సాహం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

కర్కాటకం..

ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. జీవిత భాగస్వామికి అదృష్టం పట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.

సింహం..

చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి.

కన్య..

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల కారణంగా ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

తుల..

వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు.

వృశ్చికం..

అర్ధాష్టమి కారణంగా కొన్ని శారీరక లేదా మానసిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే, ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. కుటుంబపరమైన చికాకులు ఉంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.

ధనస్సు..

ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవు తాయి.

మకరం..

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. బంధుమిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఒకరిద్దరు బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం..

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని వేళలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత పనులు వాయిదా పడతాయి. ఆదాయా నికి ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు.

మీనం..

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరు లకు సహాయం చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

 

Exit mobile version