Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచన..

daily horoscope details of different signs on november 3 2023

daily horoscope details of different signs on november 3 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో వీరు అందలాలు ఎక్కుతారు. వ్యాపారాల్లో వీరికి పోటీయే ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

వృషభం..

వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి వార్త అందుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

మిథునం..

దీర్ఘకాలిక అనారోగ్యాలతో అవస్థలు పడుతున్న వారికి ఉపశ మనం లభిస్తుంది. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు అందుకుంటారు. అదనపు ఆదాయానికి ప్రయత్నించడం మంచిది. వ్యాపారాలు ఆర్థికపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం..

సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందు తుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభి స్తాయి.

సింహం..

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావడం, ఏదో ఒక రూపంలో అదృష్టం పట్టడం, సామాజిక హోదా పెరగడం వంటివి జరుగుతాయి. మీ ప్రతిభా పాటవాలతో అధికారులను ఆకట్టు కుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది.

కన్య..

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగానే సాగిపోతాయి కానీ, కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు.

తుల..

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపార భాగస్వా ములు అనుకూలంగా మారుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రతి రంగంలోనూ ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుం టారు. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు.

వృశ్చికం..

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

ధనస్సు..

వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది. అధికారులకు మీ ఆలోచనలు, అభిప్రాయాలు బాగా నచ్చుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలతోపాటు ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది.

మకరం..

ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పట్టుదలతో బరువు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారణంగా శారీరకంగా ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం..

ముఖ్యంగా ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి పురోగతి చెందుతారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.

మీనం..

అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగ పడతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. కోపతాపాలను నిగ్రహించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

Exit mobile version