Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 10వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ సేవాలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. పైఅధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
వృషభం..
నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.
మిథునం..
కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగావకాశాలు అందివస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు.
కర్కాటకం..
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. సతీమణితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
సింహం..
ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువ అవుతుంది.
కన్య..
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
తుల..
అదనపు మార్గాల ద్వారా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు కాస్తంత తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. .
వృశ్చికం (Daily Horoscope)..
ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి అనుకోకుండా గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు.
ధనస్సు..
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది.
మకరం..
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది.
కుంభం..
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. భార్యతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మీనం..
కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది. స్థిరాస్తి వివాదం తొలగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.