Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయని తెలుస్తుంది. అలాగే మే 7 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితా లను ఇస్తాయి. ఉద్యోగం మారటానికి చేసే ప్రయ త్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆహార విహారాలలో జాగ్రత్తలు పాటిం చడం మంచిది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.
వృషభం..
అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. అద నపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభి స్తారు. ఉద్యోగపరంగా పురోగతి సాధిస్తారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుర ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. డబ్బు వసూలు చేసుకోవడానికి మంచి సమయం. ప్రేమయాత్ర సాఫీగా సాగిపోతుంది.
మిథునం..
ఆదాయం పరిస్థితి బాగానే ఉంటుంది. పొదుపు నియమాలు పాటించడం మంచిది. ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు వెళతాయి.
కర్కాటకం..
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొందరు స్నేహితులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. నమ్మకద్రోహానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ జీవితంలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది.
సింహం..
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు చిన్న పాటి ఉద్యోగంలో చేరవలసి వస్తుంది. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవహారాల జోలికి పోకపోవటం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులు పురోగతి సాధించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన స్పందన లభించకపోవచ్చు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. వాగ్దానాలు చేయటం హామీలు ఉండటం మంచిది కాదు. ప్రేమ జీవితంలో పెద్దగా ఎదుగుదల కనిపించకపోవచ్చు.
కన్య..
మొండి బాకీలు వసూలు అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఉద్యోగంలో సహచరులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ జీవితం సుఖంగా సాగిపోతుంది.
తుల..
కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశా జనకంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా గుర్తింపు లభిస్తుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు. వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోతాయి.
ఈ రాశి వారు కొత్త నిర్ణయాలు చేసే ముందు వారి సలహా తీసుకోవాలి (Daily Horoscope)..
వృశ్చికం..
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి పురోగతి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదని గ్రహించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టు కోవలసి వస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఎవరితోనూ అనవసర పరిచయాలు పెట్టుకోవద్దు. ప్రేమ జీవితం నిలకడగా ముందుకు సాగుతుంది.
ధనుస్సు..
కొద్దిపాటి ప్రయత్నంతో తమ కలలను సాకారం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. ఆదాయం పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలలో చాలావరకు ముందడుగు వేస్తారు.
మకరం..
ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించడంతో పాటు అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాల శాతం పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కుంభం..
ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. అనవసర విషయాలకు, అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం అవసరం. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా సంతృప్తికరంగా ఉండవు.
మీనం..
ఒకటి రెండు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలలో మంచి స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.