Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉందని తెలుసా..!

daily horoscope details of different signs on september 5 2023

daily horoscope details of different signs on september 5 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉందని తెలుస్తుంది. అలాగే మే 1వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రమోషన్కు అవకాశం ఉంది. అధికారులు, సహచరులు ఎంతగానో సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలలో చికాకులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

వృషభం..

ఈ రాశి వారికి ఉద్యోగంలో ఈ రోజంతా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు తగిన ప్రతిఫలం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే అంత స్థాయిలో ఉంటుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి.

మిథునం..

ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రమోషన్ కోసం సిఫారసు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించవచ్చు. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక పులికి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం..

ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ పరంగా ఒత్తిడి బాగా ఉన్నా బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులకు ఉపయోగపడే పనులు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం.

సింహం..

మొండి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. పొదుపు సూత్రాలను పాటిస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యక్తిగత సమస్యని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీ నుంచి సహాయం పొందిన కొందరు బంధువులు ముఖం చాటేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఆరోగ్యం పర్వాలేదు.

కన్య..

రాజకీయంగా పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలోనూ, వృత్తి వ్యాపారాల్లోనూ ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. కొందరు స్నేహితులు దగా చేసే అవకాశం ఉంది. ఇంట్లోనూ, వెలుపలా పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

తుల..

దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకుంటారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది.

వృశ్చికం..

ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం వంటివి పెట్టుకోవద్దు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొత్త లక్ష్యాలు మీ ముందుకు వస్తాయి. ఇంటా బయటా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు..

ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తిగత విషయాల్లో స్నేహితుల నుంచి సహాయం ఉంటుంది. అవసరానికి తగినట్టుగా డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాల వారు నిలకడగా లాభాలు గడిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మకరం..

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి విలువకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించండి. ప్రమాదాలకు అవకాశం ఉంది.

కుంభం..

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఒక మంచి సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి చెందుతారు.

మీనం..

ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు బంధువుల సహాయంతో పరిష్కారం అవుతాయి. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో పని భారం ఎక్కువవుతుంది. సంపాదనపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆహార విహారాలలో కొన్ని ముందు జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.

 

Exit mobile version