Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలానే మార్చి 5 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మేషం..
ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి.స్నేహితుల ద్వారా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృషభం..
ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా మీరే నిర్వర్తించాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. . నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఐటీ రంగానికి చెందినవారు ఆర్థికంగా ముందుకు వెళతారు. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.
మిథునం..
కొందరు మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా సాగిపోతుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులు అండగా నిలబడతారు.
కర్కాటకం..
ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలవల్ల ప్రయోజనం ఉంటుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరే సమయం అనుకూలంగా ఉంది. అంతా మన మంచికే అనుకోవడం మంచిది. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు.
సింహం..
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. పట్టుదలగా ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉద్యోగరీత్యా బాగా తిరగాల్సి వస్తుంది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ చూపిస్తారు. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.
కన్య..
అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట, శ్రమ ఎక్కువగా ఉంటాయి. అతి కష్టం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కొందరు బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబంలోని పెద్దలు చాలా వరకు అండగా నిలబడతారు. ఐటీ వంటి వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. డాక్టర్లు, లాయర్లకు క్షణం తీరిక లేకుండా ఉంటుంది. శుభవార్తలు వింటారు.
తుల..
అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం పట్టవచ్చు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకుని వదిలేసుకున్న బాకీలు చేతికి వస్తాయి. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చికం..
ఒకటి రెండు కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. బంధువుల సహాయంతో ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించుకుంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మీకు డబ్బులు చెల్లించవలసిన వాళ్లు ముఖం చాటేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి శ్రమ ఎక్కువవుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
ధనుస్సు..
మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. శుభకార్యాల మీద ఖర్చు చేస్తారు. బంధు మిత్రులతో విహారయాత్రకు బయలుదేరుతారు. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బాగా దగ్గర బంధువుల్లో ఒకరికి ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలపరంగా నిడదొక్కుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు.
మకరం..
ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా కనిపిస్తుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడటం జరుగుతుంది. కుటుంబంలో అనుకోకుండా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దగ్గర బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. బాగా తెలిసిన వారితో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం..
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ప్రయాణాల్లో డబ్బు నష్టం జరుగుతుంది. కుటుంబ సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
మీనం..
ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులకు అండగా నిలబడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఉపయోగ సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం పర్వాలేదు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/