Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి వివాదాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిదని సూచన..

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి సంబంధమైన వివాదాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే జూలై 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 07:46 AM IST

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి సంబంధమైన వివాదాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే జూలై 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలలో ఉన్న కొన్ని ప్రధానమైన అడ్డంకులను తొలగించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది.

వృషభం..

కొన్ని కుటుంబ సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి. ఆస్తి సంబంధమైన వివాదాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయానికి సంబంధించి కొందరు మిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో వీలైనంత సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మిథునం..

వృత్తి, వ్యాపారాలలో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందుల, వినోదాల్లో పాల్గొనే అవకాశముంది. ఆస్తి సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగే అవకాశముంది.

కర్కాటకం..

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్సాహంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగే అవకాశముంది. వారితో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సేవ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం..

వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అలవికాని లక్ష్యాలను అప్పగించే సూచనలున్నాయి. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, పాలిటిక్స్, ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కన్య..

కొత్త వ్యాపారాల్లో సైతం ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. అనుకోకుండా ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల..

కష్టార్జితానికి లోటు ఉండదు కానీ, మిత్రుల కోసం వృథా ఖర్చు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం మూడు పువ్కులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

వృశ్చికం (Daily Horoscope)..

ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహా రాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనస్సు..

బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్న ప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి.

మకరం..

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పక పోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనుసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోప వాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం..

భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. కొన్నికొత్త ప్రయత్నాలను చేపడతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలలో చురుకుదనం పెరుగుతుంది. ప్రయాణాలలో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీనం..

ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి.