Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే జూలై 13 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
వృషభం..
వ్యక్తిగత వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో బాధ్యతలు నిర్వహిస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. మిత్రులలో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం, సిఫారసులు చేయడం వంటివి జరుగుతాయి.
మిథునం..
బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. కొందరు మిత్రులు మిమ్మల్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు కొద్దిగా చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం..
ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
సింహం..
కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.
కన్య..
ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. వృత్తి, వ్యాపారాలలో సహచరులు, భాగస్వాములు కలిసి వస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశాభంగం కలిగించే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
తుల..
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అనవసర, అవాంఛనీయ పరిచయాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం..
ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలలో, ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. సన్నిహితులతో సంప్రదించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
ధనస్సు..
ఉద్యోగులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.
మకరం..
వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. ఇతరుల దగ్గర మీ బలహీనతలను, వ్యక్తిగత విషయాలను బయటపెట్టకపోవడం శ్రేయస్కరం. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు.
కుంభం..
వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
మీనం..
వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు. కుటుంబ సభ్యులతో అపార్థాలు చోటు చేసుకోకుండా ఆచితూచి మాట్లాడండి. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు.