Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచన..!

daily horoscope details of different signs on october 27 2023

daily horoscope details of different signs on october 27 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆగస్టు 9వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. అనుకూలమైన వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

వృషభం..

అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యో గంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

మిథునం..

వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.

కర్కాటకం..

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి.

సింహం..

వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది.

కన్య..

ముఖ్యమైన వ్యవహారాలను కూడా ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు, అవివాహితలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

తుల..

ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది.

వృశ్చికం..

కొత్త వారితో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో అత్యవసర వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

ధనుస్సు..

రాదనుకున్న డబ్బు కలిసి వస్తుంది. రోజంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యా నికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు.

మకరం..

ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలను కొన్నిటిని పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పని సరిగా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం..

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇంటా బయటా పని ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన కబుర్లు అందుతాయి.

మీనం..

ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

Exit mobile version