Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారని తెలుసా..!

daily horoscope details of different signs on october 27 2023

daily horoscope details of different signs on october 27 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 30 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

కొత్త ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయత్నాలు చేపట్టడం మంచిది. జీవితం సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో క్రియాశీలంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుం టారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు.

వృషభం..

వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరమైనవారికి వీలైనంతగా సహాయం అందజేస్తారు.కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

మిథునం..

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి కొనసాగుతుంటాయి. ఇతర శుభ గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవ కాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కర్కాటకం..

ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. రాదనుకున్న బాకీలు వసూలయ్యి డబ్బు చేతికి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

సింహం..

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉపయోగకరమైన కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ సలహాలు, సూచనలకే కాదు మీ సిఫారసులకు కూడా విలువ ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు. పుబ్బవారికి అదృష్టం పడుతుంది.

కన్య..

వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్న సమస్యలను, ఒత్తి ళ్లను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో దేవాలయాలు సందర్శించడం గానీ, విహార యాత్రకు వెళ్లడం గానీ జరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం, ఆదా యం బాగానే ఉంటాయి. ఉత్తర వారికి మాత్రం వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.

తుల..

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. సంసార జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం..

సమాజంలో గౌరవమర్యాదలు పెరుగు తాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనవసర ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు.

ధనస్సు..

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్ని హితులు కొందరు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంది.

మకరం..

ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.

కుంభం..

వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొందరు వ్యతిరేక ప్రచారం చేసే సూచనలున్నాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

మీనం..

జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం లేదా రాబడి పెరుగుతుంది. ఏలిన్నాటి శని కారణంగా వృథా ఖర్చుల మీద, అనారోగ్యాల మీదా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Exit mobile version