Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారని తెలుసా..!

daily horoscope details of different signs on september 5 2023

daily horoscope details of different signs on september 5 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 3వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

వృషభం..

కొందరు సన్నిహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది.

మిథునం..

ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసు కుని అమలు చేస్తారు. తలపెట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది.

కర్కాటకం..

ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో అధికారులు, సహచరులతో సామరస్యం పెరుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం..

వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, సంపాదన ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉంటాయి. అనవసర, అవాంఛనీయ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కన్య..

స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

తుల..

ప్రయాణాల్లో, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం..

దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే సమాచారం అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనస్సు..

తలపెట్టిన కార్యక్రమాలు, వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

మకరం..

వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టి లాభాలు గడిస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

కుంభం..

ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్ది కాలం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలకు బాగుంటుంది.

మీనం..

వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

 

Exit mobile version