Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని తెలుసా..?

daily horoscope details of different signs on august 29 2023

daily horoscope details of different signs on august 29 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 29 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, ప్రణాళికలను ప్రవేశపెడతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి.

వృషభం..

ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా, సంతృప్తికరంగా ఉంటాయి. సొంత వ్యవహారాలు, పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహా రాలను చక్కబెడతారు.

మిథునం..

ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడికి లోటు ఉండదు. ప్రభుత్వపరంగా కూడా లబ్ధి పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.

కర్కాటకం..

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకోవడం ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషదాయక వాతావరణం నెలకొంటుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కొద్దిగా డబ్బు నష్టపోతారు.

సింహం..

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. పిల్లల నుంచి చదువుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యక్తిగత కార్యకలాపాలు కూడా పెరిగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య..

నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్టుగా సాగిపోతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందు తాయి.

తుల..

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాల్లో రాబడి పెరిగి, విస్తరణ గురించి ఆలోచిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం..

వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. అవసరానికి డబ్బు అందుతుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తీసుకు వచ్చి ఇస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో కొన్నివ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి సమస్యేమీ ఉండదు. స్నేహితుల వల్ల ఇబ్బందులుంటాయి.

ధనస్సు..

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికపరంగా ముందుకు దూసుకుపోతాయి. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకువెడతారు. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది.

మకరం..

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం ఉంటాయి. ఉద్యోగం మారడానికి, ఉద్యోగంలో మార్పులు రావడానికి చేసే ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం..

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. బంధువుల రాకపోకలుంటాయి. ఒక శుభ కార్యం గురించి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం..

ఆర్థిక సమస్యలు ఆశించినంతగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి.

 

Exit mobile version