Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉందని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 19 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 10:21 AM IST

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 19 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

వృషభం..

అనుకోకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మిథునం..

ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. బాగా సన్నిహితులు కొందరు పక్కదోవ పట్టించడమో, మోసం చేయడమో జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహ కారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి.

కర్కాటకం..

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనవసర పరిచయాలతో ఇబ్బంది పడతారు. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువులకు సహాయం చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు.

సింహం..

వృత్తి, ఉద్యోగ బాధ్యతలను ఎంతో ఆత్మవిశ్వాసంతో నిర్వర్తిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ప్రయాణాలు పెట్టుకోవద్దు.

కన్య..

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువుల రాకపోక లుంటాయి. అనవసర సంబంధాలకు, పరిచయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

తుల..

శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి తన వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వలలో పడకపోవడం మంచిది.

వృశ్చికం..

వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తుల విలువ పెరిగినట్టు సమాచారం అందుకుంటారు. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

ధనస్సు..

దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం..

ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ శ్రమకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది.

కుంభం..

నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం..

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాల మీదా, దైవ కార్యాల మీదా బాగా ఖర్చు అవుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.