Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుసా..!

daily horoscope details of different signs on october 26 2023

daily horoscope details of different signs on october 26 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 15 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు కానీ, ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.

వృషభం..

ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోయి, లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలుం టాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

మిథునం..

ఉద్యోగ వాతావరణం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాలు నిర్వహిస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయ సహకారా లతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి.

కర్కాటకం..

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.

సింహం..

వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు తనం పనికి రాదు. ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవ కాశం ఉంది. బంధువుల నుంచి విమర్శలు విన వస్తాయి.

కన్య..

విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలను చాలావరకు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా, ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

తుల..

కొన్ని పరిస్థితులు కలిసి రావడం వల్ల ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృశ్చికం..

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది కానీ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా కొన్ని పనులను, ప్రయత్నాలను వాయిదా వేస్తారు. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనస్సు..

పెళ్లి సంబంధాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దీనివల్ల ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

మకరం..

దాదాపు ప్రతి చిన్న ప్రయత్నమూ సఫలం అవుతుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి.  తోబుట్టువులతో, కొందరు బంధువులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగు తుంది.

కుంభం..

చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధు వుల నుంచి అందిన శుభవార్త ఒకటి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎంతో కొంత పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

మీనం..

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో ఏవైనా సమస్యలుంటే కాస్తంత తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

 

Exit mobile version