Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయని తెలుసా..!

daily horoscope details of different signs on august 14 2023

daily horoscope details of different signs on august 14 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. మిత్రుల సహాయ సహఃకారాలతో కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు.

వృషభం..

వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఆశించిన ప్రతిఫలం అందుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. కుటుంబ సభ్యులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం..

స్థిరాస్తి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తోబు ట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం..

అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకా రాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది.

సింహం..

బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాన్ని విస్తరించడం గానీ, పెట్టుబడులు పెంచడం గానీ జరుగుతుంది. వృత్తి జీవితానికి సంబంధించి కొత్తవారు పరిచయమవుతారు.

కన్య..

ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు, ఆటంకాలు కలిగినప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.

తుల..

పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం..

వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అఅవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఒక ప్రధానమైన కుటుంబ పరిష్కారం అవుతుంది.

ధనస్సు..

కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితు లతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆగ్యం బాగానే ఉంటుంది.

మకరం..

జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చదువుల్లో పిల్లలకు అండగా ఉంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం..

ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పు వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. పిల్ల లకు సంబంధించిన చదువులు, ఉద్యోగాలు, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం..

వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు వెడతాయి.

 

Exit mobile version
Skip to toolbar