Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 10వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
వృషభం..
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ విషయాలు ఊపందుకుంటాయి.
మిథునం..
ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కర్కాటకం..
కుటుంబ సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమలో ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహం..
వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను మధ్యలోనే నిలిపేయాల్సి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.
కన్య..
ముఖ్యమైన వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలి స్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది.
తుల..
నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. కొద్ది ప్రయ త్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చు పెరుగుతుంది.
వృశ్చికం..
వ్యక్తిగత, కుటుంబ సమస్యలు ఎదురైనప్పటికి వాటిని ధైర్యంగా ఎదుర్కొని అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాగిపోతాయి.
ధనస్సు..
వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లల చదువుల విషయాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి.
మకరం..
వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
కుంభం..
వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించినంతగా స్పందన లభించకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
మీనం..
ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదా యం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోకపోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.