Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉందని తెలుసా..!

daily horoscope details of different signs on august 1 2023

daily horoscope details of different signs on august 1 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 1 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం..

కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.

మిథునం..

తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబం ధించిన పనులు ఊపందుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం..

ఉద్యోగపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్త వింటారు. వృత్తి జీవితంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందుతాయి.

సింహం..

కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకలు ఉంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య..

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తన రంగంలో పురోగతి చెందుతారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.

తుల..

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారాల పరంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచ నలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం..

ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి సాఫీగా సాగిపోతుంది. ఇంటికి బాగా దగ్గర బంధువులు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనవసర కోపతాపాలతో కుటుంబంలో ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది.

ధనస్సు..

ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మన్ననలు లభిస్తాయి. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారా లను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది.

మకరం..

వ్యాపారంలో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి జీవితం అంచనాలకు మించి ఎదు గుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభించకపోవచ్చు.

కుంభం..

వృత్తి, వ్యాపారాలలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనా లతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల తోడ్పాటును తీసుకోవడం అవసరం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం..

ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. సమయ స్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

 

Exit mobile version