Site icon Prime9

Daily Horoscope : నేడు పలు రాశుల లోని వారికి పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని తెలుసా..!

daily horoscope details of different signs on october 26 2023

daily horoscope details of different signs on october 26 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 4 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

 

మేషం..

ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు.

వృషభం..

ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలగజేస్తుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇరుగుపొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు.

మిథునం..

దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే సూచనలున్నాయి. ఎంతో శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల చిక్కుల్లో పడతారు. అతి ముఖ్యమైన కోర్టు కేసు ఒకటి వాయిదా పడుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభంచకపోవచ్చు.

కర్కాటకం..

విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సహచరులలో కొందరు మీ గురించి చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి, తిప్పట ఎక్కువగా ఉంటాయి.

సింహం..

డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల్లో ఉన్నవారు బాగా బిజీ అవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది. చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు సంపాదనకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు.

కన్య..

ఉద్యోగ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. మీ మాటకు విలువపెరుగుతుంది. . ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం లేని వారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుకుంటారు.

తుల..

ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు పడతారు. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వారు ఉంటారు. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.

ఈ రాశుల వారికి పెరగనున్న రాజకీయ పరిచయాలు (Daily Horoscope)..

వృశ్చికం..

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. డబ్బు నష్టం జరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు.

ధనుస్సు..

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి ఎక్కువవుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అనుకూల సమయం. వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు స్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది.

మకరం..

ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. పిల్లలు చదువులోనూ, ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం కావచ్చు. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

కుంభం..

ఒకటి కంటే మించి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ఆరాటం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

మీనం..

ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి లాభాల పంట పండుతుంది. ఐటీ నిపుణులకు విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.

Exit mobile version