Site icon Prime9

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి ఇంటి సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుసా..!

daily horoscope details of different signs on october 18 2023

daily horoscope details of different signs on october 18 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 15 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. సంతానం పురోగతి చెందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం..

ఉద్యోగ పరంగా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఖర్చులు మాత్రం తడిసి మోపెడు అవుతాయి. బంధువులకు ఆర్థికంగా బాగా సహాయపడతారు. వృత్తి వ్యాపారాలు కష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. మితిమీరిన ఔదార్యంతో వ్యవహరించవద్దు. ఆరోగ్యం పర్వాలేదు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది.

మిథునం..

కొద్దిగా ఆర్థిక స్తోమత పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటి సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది.

కర్కాటకం..

ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటి సమస్య ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది. మీ వల్ల సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు మిత్రుల సహాయంతో ఉద్యోగం సంపాదించుకుంటారు. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి నిలకడగా ఉంటుంది.

సింహం..

ఆర్థిక పరిస్థితి పరవాలేదు. అయితే అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ఆశలు పెట్టుకున్న పెళ్లి సంబంధం వెనక్కి వెళుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్థారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి.

కన్య..

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పరంగా బాగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆశించినంతగా ఉండవు. సమాజంలో గుర్తింపు ఉంటుంది.

తుల..

ఆదాయ అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం..

ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వృత్తిలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు దూరప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

ధనుస్సు..

వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

మకరం..

వృత్తి నిపుణులకు మంచి పురోగతి కనిపిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనుభవానికి వస్తాయి. బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది.

కుంభం..

ఆశించిన శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికార లాభం ఉంది. బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో ఆచితూచి మాట్లాడండి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులు సునాయాసంగా లాభాలు గడిస్తారు.

మీనం..

అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో మంచి జరుగుతుంది. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. ఖర్చులు బాగా పెరిగినా, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితులు సహాయంగా ఉంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

 

Exit mobile version
Skip to toolbar