Site icon Prime9

Daily Horoscope: ఈ రాశి వారు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి.. జూన్ 8వ తేదీ దినఫలాలు ఇలా

daily horoscope details of different signs on august 29 2023

daily horoscope details of different signs on august 29 2023

Daily Horoscope: రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి జూన్ 8 వ తేదీ, గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం

మేష రాశి వారు శుభ కార్యాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందు వినోదాలు. వాహనయోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం చదువుకుంటే మంచి ఫలితం.

వృషభం

ఈ రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పనుల్లో జాప్యం. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మిత్రులు, కుటుంబ సభ్యులతో అకారణంగా వైరం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులున్నాయి. శ్రీ శివ పార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

మిథునం

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో లాభం పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

 

వ్యాపార, ఉద్యోగాల్లో (Daily Horoscope)

 

కర్కాటకం

కర్కాటక రాశి వారికి శుభకాలం నడుస్తోంది. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు ఉన్నాయి. వాహన, గృహయోగాలు. అవసరానికి తగ్గట్టు ముందుకు సాగడం వల్ల మేలు జరుగుతుంది. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. శివారాధన శుభప్రదం.

సింహం

చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వింధు, వినోదాల్లో పాల్గొంటారు. భూములు, వాహనాల లాంటి నూతన వస్తువులు కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సూర్యాష్టకం చదవడం శ్రేయస్కరం.

కన్య

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం దగ్గదు. ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసలు ఉంటాయి. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. గో సేవ చేయడం మంచిది.

 

శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన (Daily Horoscope)

 

తుల

తుల రాశి వారు కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధన వ్యయం ఉంటుంది. కుటుంబ సమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివితే బాగుంటుంది.

వృశ్చికం

ఒక శుభవార్త ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. మీ మీ రంగాల్లో ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి.

ధనస్సు

మీ రంగంలో మిమ్మల్ని అభిమానించే వారు ఎక్కువ అవుతారు. శభ ఫలితాలు ఉన్నాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం చేకూరుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

 

పనితీరుకు ప్రశంసలు (Daily Horoscope)

 

మకరం

ఈ రాశి వారకి అంతా అనుకూలంగా ఉంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. ఇష్టదైవ సందర్శనం మేలు జరుగుతుంది.

కుంభం

ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఏకాగ్రతతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆలోచనలు కలసి రావు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మీనం

మీన రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలున్నాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.

 

Exit mobile version