Astrology News : ప్రేమ.. అక్షరాలు రెండే అయినప్పటికి వర్ణించడానికి వీలు కాని ఓ గొప్ప అనుభూతి. ప్రేమకు.. భాష, కులం, మతం, రంగు, అడ్డుగా కనిపించవు కూడా. ప్రస్తుత కాలంలో అయితే జెండర్ తో సంబంధం లేకుండా ప్రేమించుకొని వివాహాలు చేసుకున్న వారిని కూడా చూస్తున్నాం. అటువంటి గొప్ప ఎమోషన్ ప్రేమ. రెండు అక్షరాల ప్రేమే.. రెండు జీవితాలను కలుపుతుంది. రెండు అక్షరాల ప్రేమే.. రెండు భిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులను దగ్గర చేస్తుంది.. జీవితాంతం కలిసి ఉంచుతుంది. ఇలా ప్రేమ గురించి.. ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. అంతేకాదు ప్రేమకు సాధ్యం కానిది ఏదీ లేదని చాలామంది నమ్ముతారు. అందుకే తమ సోల్ మేట్ కోసం వెతుకుతారు. మరికొందరు మరో అడుగు ముందుకువేసి తమ అభిమాన సినీ తారలతో ప్రేమలో పడుతుంటారు. వారే తమ జీవిత సర్వస్వం అని గుడ్డిగా నమ్ముతుంటారు. వారితో రిలేషన్ అనే ఊహల్లో విహరిస్తుంటారు. అయితే ఇది వారి రాశి ప్రభావమేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటి? ఆ రాశుల వారు సినీ తారలతో ఎక్కువగా ప్రేమలో పడడానికి కారణం ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
ఏ ఏ రాశుల వారు అంటే (Astrology News)..
వృషభం..
ఈ రాశి వారికి విలాస వంతంగా, గ్రాండ్ గా ఉండే జీవితం కావాలని ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా ఇలాంటి అభిరుచులే ఉంటాయి. అందుకే తాము ప్రేమించే వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి అయి, మంచి పేరు, ప్రఖ్యాతలు.. ఉన్నవారై ఉండాలనుకుంటారు. అందుకే ఇటువంటి లక్షణాలు ఉన్న సినీ తారలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారితో ప్రేమలో పడిపోతుంటారు అని తెలుస్తుంది.
ధనుస్సు..
ఈ రాశి వారు విలాసవంతమైన, కాలుమీద కాలేసుకుని గడిపేసే జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు, కాబట్టి వారు సినిమా నటులతో ప్రేమలో పడే అవకాశం ఉంది. సినిమా తారలు అనుభవించే లావిష్‌నెస్, సౌకర్యాలు, సుఖాలు వీరికి బాగా ఇష్టంగా ఉంటాయి. వారితో చిన్నపాటి పరిచయం, ప్రేమ, సంబంధం ఏదైనా కానీ వీరిని బాగా సంతోష పెడుతుంది.
మీన రాశి..
శృంగారంలో మునిగిపోవడం ఎక్కువగా మాత్రమే ఇష్టమైన కలలు ఈ రాశి వారికి. అందుకే సినీ నటుల జీవితాల్లో అలాంటి సందర్భాలే ఉంటాయని నమ్ముతారు. వారితో ప్రేమలో పడతారు. సినీ పరిశ్రమ లోని జంటల మీద వారి అంచనాలు భారీగానే ఉంటాయి. కాబట్టి, వారు తమను తాము ఇలాంటి సంబంధంలో ఊహించుకుంటారు. అది వారిని సంతోషపరుస్తుంది. ఈ రాశి వారు కొంచెం రొమాంటిక్ గా ఉంటారు.
సింహ రాశి..
వీరికి సినీ నటుల ప్రతీ కదలికా ఓ అద్భుతమే. అంతరాంతరాల్లో వారిలా ఉండాలని కోరుకుంటుంటారు. అందుకే సినీ నటులతో ప్రేమలో పడుతుంటారు. ఆ జీవితాన్ని, వారి కీర్తిని.. పేరును ఎంజాయ్ చేయాలనుకుంటారు.
తుల రాశి..
వీరు ఎప్పుడూ వెండి తెర మీద వెలిగిపోయే సినీ తారలతో ప్రేమలో సులభంగా పడిపోతారు. వారితో సంబంధం కోసం ఎంతకైనా వెడతారు. సినీ నటులతో సంబంధం వారి జీవితంలో జరిగే ఉత్తమమైన విషయాలలో ఒకటి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/