Site icon Prime9

Annavaram: రేపటి నుంచి సత్యదీక్షలు ప్రారంభం.. ఈ దీక్ష పూజావిధానాల కోసమే ఈ బుక్..!

the Satya Diksha Vratakalpam book lunch

the Satya Diksha Vratakalpam book lunch

Annavaram: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సత్య దీక్షలు ఈనెల 21వ తారీకు నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఈ  సత్య దీక్ష యొక్క విధివిధానాలు, నిత్య పూజావిధానము, భక్తులకు మరియు దీక్ష దారులకు తెలియజేసేలా సత్య దీక్ష వ్రతకల్పం అనే పుస్తకాన్ని రచించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి సత్యదీక్షలు ప్రారంభమవనున్నాయి. అనగా ఆశ్వీజ మాసం మఖ నక్షత్రం నుండి ప్రారంభమై కార్తీక మాసం మఖ నక్షత్రం రోజు వరకు ఈ దీక్షను చేపట్టనున్నారు. కాగా ఈ దీక్ష యొక్క విధి విధానాలు నియమ నిబంధనలు నిత్య పూజా విధానం తెలుపుతూ దాతల సహాయంతో ముద్రింపబడిన శ్రీ సత్య దీక్ష వ్రతకల్పము అనే పుస్తకాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐ.వి రోహిత్, ఏసీ రమేష్ బాబు, వీఆర్వో కొండలరావు, ఏఈఓ ఎల్ శ్రీనివాస్, మరియు గల్లా దాసు, బండారు కృష్ణమూర్తి ఇతర దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం

Exit mobile version