Site icon Prime9

Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ పనులు చేస్తే అదృష్టం మీ వెంటే..

Akshaya Tritiya

Akshaya Tritiya

Akshaya Tritiya: అక్షయ తృతీయ అనగానే గుర్తుకొచ్చేది బంగారం కొనటం. మహాలక్ష్మీని ఐశ్వర్వాలనకు అధినేత్రిగా కొలుస్తారు. ఆమె కటాక్షం ఉంటే ఎలాంటి లోటు ఉండదని విశ్వసిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలుకు ఎక్కువమంది ఆస్తకి చూపుతారు. నిజానికి అక్షయ తృతీయకి సంబంధించిన శాస్త్రాల్లో ప్రకారం.. వైశాఖ శుద్ధ తదియ నాడు వచ్చేది అక్షయ తృతీయ. అక్షయం అంటే తరగనిది. తృతీయ అంటే 3 రోజులు. హిందూ శాస్త్రం ప్రకారం ఈ మూడు రోజులు తిథి సంపూర్ణంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం నాడు వస్తుంది. ఈ తిథి ఇంటికి శుభాలు, విజయాలను తీసుకొస్తుందని హిందువుల విశ్వాసం. దీనినే నవన్న పర్వం అని కూడా పిలుస్తారు.

అక్షయ తృతీయ రోజుల్లో ఎవరికైనా దానం చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఏ శుభ కార్యమైనా, వ్యాపారం అయినా ప్రారంభించటానికి అక్షయ తృతీయకు మించిన మంచి ముహూర్తం లేదంటారు పండితులు. ఆ రోజు ప్రారంభించే పని అంతకంతకూ వృద్ధి చెందుతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని బియ్యపు గింజలతో పూజించాలని చెబుతారు. దానాలు చేసినా మంచి ఫలితం దక్కుతుందని నమ్మకం.

అక్షయ తృతీయ రోజు చేయాల్సినవి(Akshaya Tritiya)

అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తల స్నానం చేయాలి. గోమాతను పూజించాలి. గోవులకు గోధుమ, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని పెట్టాలి.

అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే ప్రతీతి. అదే విధంగా వేద పండితులకు బియ్యం, ఉప్పు, నెయ్యి, చక్కెర, కూరలు, చింతపండు, పండ్లు, బట్టలు ఏది దానం చేసినా మంచిదని చెబుతారు.

ఈ రోజు పసుపు, కుంకుమ దానం చేస్తే మహిళలు సౌభాగ్యవతిగా ఉంటారు. అన్నదానం చేస్తే సాక్షాత్తు దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుంది. పండ్లు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది.

ఉన్నత పదవులు లభిస్తాయి. చెప్పులు, విసనకర్ర, గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది. వస్త్ర దానం చేయడం వల్ల రాజయోగం లభిస్తుంది. ఆరోగ్యం చేకూరుతుంది.

మజ్జిగ లేదా నీరు దానం చేస్తే మంచి విద్య చేకూరుతుంది. పెరుగుదానం చేస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాల మరణాలు నుంచి బయటపడతారు.

గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది. ఇలా అక్షయ తృతీయ రోజు ఏది దానం చేసినా మంచి జరుగుతుందని హిందువుల విశ్వసిస్తారు.

 

Exit mobile version