February 20 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.
మేషం – వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం.
వ్యషభం – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందగలుగుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీకు తోచిన విధంగా నలుగురికి సహాయం చేయగలుగుతారు.
మిథునం – అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు తీరుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.
కర్కాటకం – ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విందు వినోదాలలో పాల్గొంటారు. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది.
సింహం – కొంతకాలంగా వేధిస్తున్న సమస్య తీరుతుంది.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య – సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. పిల్లల విద్యా విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డబ్బు కూడా ఖర్చు పెడతారు.
తుల – సహుద్యోగులు మీ మీద చేస్తున్న దృశ్ప్రచారం అబద్ధాలే అని నిరూపిస్తారు. ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా కొంత నిరాశ అనేది ఉంటుంది. మానసిక సంత్రుప్తి అనేది లోపిస్తుంది.
వృశ్చికం – వైద్య విద్యకు సంబంధించిన విషయాలు విదేశీయాన సంబంధించిన విషయాలు అతి కష్టం మీద సానుకూల పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితులు, సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు.
ధనుస్సు – కారణాలు ఏమైనా వృత్తి- ఉద్యోగ విషయాలలో కచ్చితంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు కొంతమందికి నచ్చదు. ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి.
మకరం – వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి. ప్రజాదారణ బాగుంటుంది. ప్రచార సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందగలుగుతారు. ఎవరిని నొప్పించకుండా అందరికీ న్యాయం చేస్తారు. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది.
మీనం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీకు రావాల్సిన బిల్లులు, వడ్డీలు చేతికి అందుతాయి. ఆత్మీయులతో విభేదాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి.