Site icon Prime9

Trian Accident: ‘రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేము’

Odisha Train Accident

Odisha Train Accident

Trian Accident: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది. ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రులకు భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక, మయూక్ భంజ్, కటక్ లోని హాస్పిటల్స్ చికిత్స అందిస్తున్నారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిని వాళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నట్టు సమాచారం. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

 

సహాయ చర్యలపైనే దృష్టి(Trian Accident)

కాగా, రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదం స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.

‘క్షతగాత్రులకు సమీపంలోకి హాస్పిటల్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం సహాయక చర్యలపైనే పూర్తిగా దృష్టి పెట్టాం. ఘటనా స్థలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రైలు ప్రమాదానికి గల కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఈ సంఘటనపై విచారణ చేపట్టి మరిన్ని వివరాలు సేకరించిన తర్వాత వివరాలు అందించగలం. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశాం’ అని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

 

పెరుగుతున్న మృతుల  సంఖ్య

ఇప్పటి వరకు 233 మృత దేహాలను వెలికి తీసినట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ పీకే జెనా ప్రకటించారు. 900 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 600 నుంచి 700 మంది ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రమాద స్థలిలో 250 అంబులెన్స్ లు, 65 బస్సులు ఘటనా స్థలంలొ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని పీకే జెనా తెలిపారు.

Exit mobile version