Prime9

Post Office TD Schemes: పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకాలు.. వడ్డీ రేటు, అర్హత, ప్రయోజనాలివే..!

Post Office Time Deposit – Schemes, Interest Rates: సంపాదించిన డబ్బును పొదుపు చేసేందుకు చాలా మార్గాలున్నాయి. అందులో ఎక్కువ మంది చిన్న చిన్న మొత్తాలను పొదుపుగా చేసుకుంటూ ఉంటారు. ఇందుకోసం చాలా పథకాలు ఉన్నాయి. అయితే డబ్బును పొదుపు చేసేందుకు పోస్టాఫీస్ ఎన్నో పథకాలను పరిచయం చేసింది. అందులో చాలా స్కీమ్స్ అద్భుతంగా ఉన్నాయి.

 

ప్రధానంగా నమ్మకం, సురక్షితం ఆలోచించే వ్యక్తులు మాత్రం ఫిక్స్ డ్ డిపాజిట్స్ చేస్తుంటారు. వీటినే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌గా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన స్కీమ్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ అర్హులుగా పేర్కొన్నప్పటికీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి పేరు సంపాదించుకుంది.

 

వడ్డీరేట్లు..

ప్రతీ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇండియన్ ఎకానమిక్ మినిస్టర్స్ శాఖ వడ్డీరేట్లను సమీక్షిస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై దిగుబడిని పరిగణలోకి తీసుకొని వడ్డీరేట్లను నిర్ణయిస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 జూన్ 30 వరకు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ అకౌంట్ వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌కు 6.9శాతం వడ్డీ రేటు ఉండగా.. 2 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌కు 7 శాతం, 3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌కు 7.1శాతం, 5 ఏళ్ల డిపాజిట్ ప్లాన్‌కు 7.5శాతం వడ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికంలో ఆర్థిక మంత్రిత్వశాఖలో సమీక్షిస్తుంది.

 

అర్హతలు..

భారతీయులు ఒక్కరు లేదా ఫ్యామిలీగా అకౌంట్ తెరవవచ్చు.

10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే మైనర్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

మైనర్ తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఈ అకౌంట్ తెలరవచ్చు.

ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ.1000 పెట్టవచ్చు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్ బ్యాంకు, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులకు పెట్టుబడి దారులు ఈ పథకం కింద అకౌంట్ ఓపెన్ చేసేందుకు అవకాశం అనుమతి ఇచ్చింది.

Exit mobile version
Skip to toolbar