Site icon Prime9

OnePlus Smart TV: వన్ ప్లస్ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు ఇవే!

one plus prime9news

one plus prime9news

OnePlus Smart TV:  స్మార్ట్ టీవీలు కొనాలనుకుంటున్న వారికి ప్రస్తుతం ఈ-కామర్స్ సేల్స్‌లో అనేక ఆఫర్లు మనకి అందుబాటులోకి ఉన్నాయి. చాలా కంపెనీల స్మార్ట్ టీవీలు డిస్కౌంట్‌లకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఒక డీల్ ఆకర్షణీయంగా ఉంది. ఇది కొంతకాలమే ఉండే అవకాశం కనిపిస్తోంది. oneplus 50 Y1S Pro సిరీస్‌లోని 50 ఇంచుల 4K smart tv ప్రస్తుతం డిస్కౌంట్ ధరతో మనకి అందుబాటులో ఉంది. దీనికి బ్యాంక్ కార్డ్ ఆఫర్‌ కూడా ఉంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

OnePlus 50Y1S Pro స్పెసిఫికేషన్లు..
50 ఇంచుల 4K UHD Resolution Display వన్ ప్లస్ టీవీ 50వై1ఎస్ ప్రో స్మార్ట్ టీవీ మన ముందుకు వస్తోంది. HDR10+, HDR10, HLG సపోర్ట్, గామా ఇంజిన్‌ ఉంటాయి. బెజిల్‌లెస్ డిజైన్‌‌ను ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంది. డాల్బీ ఆడియో, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే 24వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్ టీవీలో ఉన్నాయి.

oneplus 50Y1s ప్రో 4కే స్మార్ట్ టీవీపై ఆఫర్
వన్‌ప్లస్‌ 50వై1ఎస్ ప్రో 4కే స్మార్ట్ టీవీ ధర ప్రస్తుత అమెజాన్ సేల్‌లో డిస్కౌంట్‌తో రూ.30,999 ధరకే మనకి అందుబాటులో ఉంది. సాధారణంగా ఉండే ధర కంటే తక్కువకు అందుబాటులో ఉంది. దీంతో పాటు ICIC,AXIS బ్యాంక్, CITI బ్యాంక్ క్రెటిట్ కార్డులతో కొంటే కొంత వరకు తగుతుంది. ఈ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డుతో ఈ oneplus 50 ఇంచుల 4కే స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.4,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అప్పుడు ఈ స్మార్ట్ టీవీ రూ.26,749కే దక్కించుకోవచ్చు.

Exit mobile version