Infosys president: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి ఆ సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషి(Mohit Joshi) రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ.. స్టాక్ ఎక్స్చేంజ్ కి సమాచారం ఇచ్చింది. ‘ ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ రాజీనామా చేశారు.
మార్చి 11 నుంచి ఆయన లీవ్ లో ఉంటారు. ఇన్ఫోసిస్ లో జూన్ 9, 2023.. ఆయన చివరి వర్కింగ్ డే’ అని సంస్థ వెల్లడించింది. కంపెనీ జోషీ చేసిన సేవలను ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొనియాడారు.
రెండు దశాబ్దాలకు పైగా సేవలు
2000 నుంచి ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బిజినెస్ ను పర్యవేక్షించారు.
రెండు దశాబ్దాలకు పైగా సంస్థలో విభిన్న స్థాయిలో పనిచేశారు. ఎడ్జ్ వర్వ్ సిస్టమ్స్ కు ఛైర్మన్ గానూ వ్యవహరించారు.
ఇటీవల దావోస్ జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు కంపెనీ నుంచి మోహిత్ జోషీ హాజరయ్యారు.
ఆ సమయంలోనే ఆయన ఇన్ఫోసిస్ కు రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గోవాలో జరిగిన ఇన్ఫీ లీడర్ షిప్ సమావేశంలో ఆయన పాల్గొనలేదు.
దీంతో ఆయన రాజీనామా వార్తలు బలాన్ని చేకూర్చాయి.
టెక్ మహీంద్రా లో చేరిక(Infosys president)
మరోవైపు ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసిన మోహిత్ టెక్ మహీంద్రాలో చేరాను. ఈ మేరకు టెక్ మహీంద్రా ఓ ప్రకటన వెల్లడించింది.
మోహిత్ జోషిని తమ కంపెనీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పేర్కొంది.
కాగా, ప్రస్తుతం టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ ఈ ఏడాది డిసెంబర్ 19 న రిటైర్ అవనున్నారు.
అదే రోజు జోషీ బాధ్యతలు చేపడతారని టెక్ మహీంద్రా తెలిపింది.
అయితే, ఈ మధ్య కాలంలో ఇన్ఫోసిస్ ను వీడిన రెండో కీలక వ్యక్తి మోహిత్ జోషీ.
ఆయనకంటే ముందు గత ఏడాది అక్టోబరులో కంపెనీ ప్రెసిడెంట్‌గా ఉన్న రవి కుమార్ ఎస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన కాగ్నిజెంట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.