Site icon Prime9

ICICI Offers: కస్టమర్స్ గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్..

ICICI Offers

ICICI Offers

ICICI Offers: దిగ్గజ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవికి బొనాంజా ఆఫర్లు తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఈ ఆఫర్లతో ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, నగలు, టూర్స్ లో చెల్లింపులు ఇలా పలు ఆకర్షణీయమైన తగ్గింపులను ఐసీఐసీఐ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌, ఈఎంఐ, నెట్‌ బ్యాంకింగ్‌ ల ద్వారా ఈ వేసవి బొనాంజా ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ అయిన యాపిల్‌, ఎల్‌జీ, సోనీ కంపెనీలకు కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది.

 

ఈ ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే..(ICICI Offers)

ఎలక్ట్రానిక్స్ కంపెనీలైన షావోమీ, వీవో, వన్‌ప్లస్‌ కంపెనీ ఉత్పత్తులపై 8 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది.

క్రోమా రిటైల్‌ స్టోర్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేస్తే 5 వేల వరకు తగ్గింపు ఆఫర్‌ వస్తుంది.

ఎల్ జీ , సోనీ, శాంసంగ్‌, డెల్‌, హైయర్‌ లాంటి ప్రముఖ బ్రాండ్‌ ఉత్పత్తులపై 22.5 శాతం డిస్కౌంట్‌ ను ఇస్తోంది.

 

విహారయాత్రల కోసం

అదే విధంగా టూర్స్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వారికోసం.. మేక్‌ మై ట్రిప్‌, ఈసీ మై ట్రిప్‌, యాత్రా లాంటి ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్‌ ఫ్లాట్‌ ఫామ్ ల నుంచి విమాన ప్రయాణాలకు టికెట్‌ కొంటే 15 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. అదే బస్సు లో అయితే 25 శాతం డిస్కౌంట్‌ వస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఈ ఆఫర్ కింద ఏ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి హోటల్‌ లేదా విల్లా బుక్‌ చేసుకున్నా.. వాటిపై 25 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది.

 

ఆన్‌లైన్‌ షాపింగ్‌లోనూ

ఇక ఫుడ్ విషయానికి వస్తే జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకుంటే షరతులతో 20 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.

ఏదైనా గిఫ్టులు, మొక్కలు, పువ్వులు వంటి వాటిపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌లోనూ కొన్ని బ్రాండ్లపై పెద్ద ఎత్తున తగ్గింపు లభిస్తోంది.

మేకప్, ఆరోగ్య సంబంధింత ఉత్పత్తులపై కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ ఆఫర్లు ప్రకటించింది. ఫార్మ్ ఈజీ, టాటా క్లిక్ పాలెట్, హెల్త్‌ కార్ట్‌ లాంటి వాటిపై ఏకంగా 20 శాతం డిస్కౌంట్‌ని అందిస్తోంది. ఈ ఆఫర్ల కు సంబంధించిన పూర్తి వివరాలకు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

 

 

Exit mobile version