EPFO Money withdraw from ATM: EPFO 3.0 అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సేవలను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన డిజిటల్ అప్డేట్. ఈ కొత్త వ్యవస్థ ద్వారా.. ఉద్యోగులు తమ PF ఖాతా నుండి నగదు డ్రా చేసుకోవడానికి ATM కార్డులు ఉపయోగించవచ్చు. అలాగే UPI ద్వారా కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఉద్యోగులు తమ అకౌంట్ నుండి నగదు తక్కువ సమయంలోనే పొందడానికి అవకాశం ఉంటుంది.
ATM ద్వారా PFడబ్బులు డ్రా చేసుకోవడం..
EPFO 3.0 ప్రకారం PF అకౌంట్ ఉన్న వారికి ATM కార్డులు అందజేస్తారు. ఇవి వారి PF ఖాతాతో లింక్ చేయబడతాయి. ఈ కార్డులను ఉపయోగించి.. ATM ద్వారా తమ PF ఖాతా నుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. PF అకౌంట్ ఉన్న వారు తమ బ్యాలెన్స్ లో 50% వరకు డబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం, అత్యవసర పరిస్థితుల్లో.. ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తుంది .
UPI ద్వారా PF డబ్బులు డ్రా చేసుకోవడం..
UPI ద్వారా PF నగదు డ్రా చేసుకునే అవకాశం EPFO 3.0 ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ విధానంలో PF అకౌంట్ ఉన్న వారు తమ PF ఖాతా బ్యాలెన్స్‌ను UPI యాప్‌ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇతర బ్యాంక్ అకౌంట్ కు కూడా డబ్బులను వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఈ విధానం, PF డబ్బులు డ్రా చేసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తుంది .
EPFO 3.0 యొక్క ప్రయోజనాలు..
ATM , UPI ద్వారా PF డబ్బులను తక్షణమే పొందవచ్చు. ఇది ఉద్యోగులకు ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
సులభమైన ప్రక్రియ: పాత విధానాలలో ఉన్న ఫారమ్‌లు ,మాన్యువల్ ప్రాసెసింగ్ అవసరం లేకుండా, ఈ కొత్త విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది.
డిజిటల్ ఇంటిగ్రేషన్: UPI, ATM వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా PF సేవలను అందించడం, డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తుంది.
EPFO 3.0 ప్రారంభ తేదీ:
జూన్ లోనే కేంద్రం EPFO 3.0 ను 2025 ప్రారంభించే అవకాశాలు కనిస్తున్నాయి. ఈ కొత్త విధానాలు, EPFO సభ్యులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడానికి రూపొందించబడ్డాయి .
EPFO 3.0 ద్వారా.. PF సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బులను తక్షణమే, సులభంగా డ్రా చేసుకోవడానికి వీలుగా మార్పులు చేశారు. ATM, UPI ద్వారా నగదు డ్రా చేసుకోవడం, ఉద్యోగులకు ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. ఈ మార్పులు, డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తూనే PF సేవలను మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.