EPFO Launches UPI and ATM: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్ డ్రా కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. నగదు డ్రా చేసుకునేందకు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఏటీఎం, యూపీఐతో క్షణాల్లో పీఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పేతో యూపీఐ ద్వారా నగదు డ్రా చేసుకునేలా కొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది.
యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ కొత్త ప్రక్రియను క్రమబద్ధీకరించింది. ఈ విధానంతో రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆటోమేటెడ్ సిస్టం ద్వారా ఇష్టమొచ్చిన బ్యాంక్ అకౌంట్‌కు నగదును పంపవచ్చు. నగదు డ్రా చేసుకునేందుకు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
తొలుత యూపీఏ అకౌంట్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసి ఉండాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అయి విత్ డ్రా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే యూపీఐ లేదా ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే ఆప్షన్ ఎంచుకోవాలి. లావాదేవీలకు సంబంధించి సూచనలు అనుసరించాలి. ఇక, ప్రాసెస్ విధానంలో ప్రొసిజర్ ఆధారంగా ఆప్షన్లు ఎంచుకోవాలి. చివరగా యూపీఐ యాప్ ఉపయోగించి నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా ఏటీఎం వద్దకు వెళ్లి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. చివరికి బ్యాలెన్స్ చెక్ చేసుకొని రసీదు తీసుకోవాలి.