Site icon Prime9

DCB Bank: సేవింగ్ అకౌంట్ల పై వడ్డీ శాతం పెంచిన డీసీబీ బ్యాంక్

Savings Accounts: డీసీబీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు చెప్పింది. డీసీబీ బ్యాంక్ కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రేట్లను పెంచింది. డీసీబీ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త బ్యాంక్ ఖాతాలను తెరిచే అవకాశం ఎక్కువ ఉంది. సేవింగ్స్ ఖాతాలపై అధిక రాబడి వస్తుంది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 22 నుంచి అమలులోకి ప్రవేశ పెట్టింది. ఈ రేట్ల పెంపు తర్వాత బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ రేటును ఖాతాదారులకు ఆఫర్ చేసింది.

డీసీబీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు..
బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు ప్రాతిపదికన వడ్డీ రేటు మారుతూ ఉంటుందని డీసీబీ బ్యాంక్ వాళ్ళు తెలియజేసారు. రూ లక్ష లోపు బ్యాంక్ బ్యాలెన్స్ఉన్నవారికిబ్యాంక్ 2.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. అలాగే రూ.ఒక లక్ష నుంచి రూ. 2 లక్షల మధ్య బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వారికి బ్యాంక్ 4 శాతం వడ్డీ వస్తుందని తెలియజేసారు. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలలోపు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై అయితే 5 శాతం వడ్డీ రేటు వస్తుందని, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ల వారికి 6 శాతం వడ్డీ రేటు వస్తుందని తెలుయజేశారు .

ఇంకా రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వారికి 6.75 శాతం వడ్డీ వస్తుంది. రూ. 25 లక్షల నుంచి రూ. 2 కోట్లలోపు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వారికి 7 శాతం వడ్డీ కలుస్తుందని తెలుయజేశారు. రూ. 2 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై 5.5 శాతం వడ్డీ వస్తుంది. రూ. 50 కోట్లకు పైన బ్యాలెన్స్ ఉంటే 5 శాతం వడ్డీని కలుస్తుందని డీసీబీ బ్యాంక్ వారు తెలిపారు. మీరు ఒకసారి డీసీబీ బ్యాంక్ వారి వెబ్‌సైట్ చూస్తే మీకు పైన ఉన్న వడ్డీ రేట్ల గురించి తెలుస్తుంది. బ్యాంక్ ఖాతాలో రోజు వారీ బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి వడ్డీని కలుస్తుందని చెప్పారు. ఈ వడ్డీ డబ్బులను ఏడాదికి ఒకసారి చొప్పున నగదును చెల్లిస్తారు. మన దేశంలో ఉన్న వారు, ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఈ సేవింగ్స్ అకౌంట్ల ఉన్న వాళ్ళకు కూడా ఈ వడ్డీ రేట్లు కలుస్తాయని డీసీబీ బ్యాంక్ వారు తెలిపారు

Exit mobile version