Airtel : భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్, గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వినియోగదారుల ప్యాక్‌ల సబ్‌స్క్రిప్షన్‌లో 102% వృద్ధిని సాధించింది. చివరి క్షణంలో రద్దీని తప్పిస్తూ, సేవలను విస్తరించేందుకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్‌లో ఎయిర్‌టెల్ తన రోమింగ్ కియోస్క్‌ను ఏర్పాటు చేసింది.
అనుసంధానం కావడాన్ని సులభం, సహజమైన మరియు తప్పనిసరిగా ఉండేలా చేసేందుకు, ఎయిర్‌టెల్ తన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌ను రిఫ్రెష్ చేసింది. దీని ధర ప్రారంభంలో రోజుకు రూ.133 మాత్రమే అవుతుంది. ఇది పలు దేశాల స్థానిక సిమ్‌ల కన్నా మరింత పొదుపును అందిస్తుంది. దీని ఫలితంగా ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ విభాగాలు రెండింటిలోనూ ప్యాక్ సబ్‌స్క్రిప్షన్‌లలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది. పది-రోజుల చెల్లుబాటు ప్యాక్‌లు హైదరాబాద్ నుంచి వెళుతున్న అవుట్ రోమర్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాక్ సబ్‌స్క్రిప్షన్‌లుగా ఉన్నాయి. భారతదేశం నుంచి అమెరికా మరియు యూకేలకు ఎక్కువగా ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాదీల కోసం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ హాలిడే గమ్యస్థానాలలో జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మరియు స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాలు ఉన్నాయి.
ఎయిర్‌టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ గురించి భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సీఈఓ శివన్ భార్గవ మాట్లాడుతూ, “ఎయిర్‌టెల్‌లో, మా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు మేము నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాము. మా కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు మరోసారి వినియోగదారుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించాయి. విదేశాలకు వెళ్లేటప్పుడు నమ్మకమైన కనెక్టివిటీ ఈ రోజుల్లో పూర్తిగా అవసరం. మేము అందిస్తున్న ప్రముఖ రోమింగ్ ప్లాన్‌లు చాలా సరసమైనవి. మా వినియోగదారులు ఎక్కడ ఉన్నా, వారి సిమ్ కార్డ్‌లు లేదా నంబర్‌లను మార్చే ఇబ్బంది లేకుండా అన్ని సమయాలలో తమ వారితో అనుసంధానమై ఉండేలా చూస్తుంది. ఈ సెలవు సీజన్‌లో ప్రయాణాలు మరింత పెరుగుతాయని మేము అంచనాకు వచ్చాము. మరింత అనుసంధానించబడిన ప్రయాణ అనుభవం ద్వారా హైదరాబాదీలకు సేవలను అందించాలని మేము వేచి చూస్తున్నాము’’ అని పేర్కొన్నారు.
ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ స్థానిక సిమ్ కార్డ్‌లపై అనేక ప్రయోజనాలను అందిస్తోంది. వీటిలో వేగవంతమైన కనెక్టివిటీ (నంబర్ మార్పు అవసరం లేదు), అందుబాటులో ఉన్న అత్యుత్తమ నెట్‌వర్క్, సౌకర్యవంతమైన వ్యవధి ఎంపికలు, అపరిమిత అత్యవసర కనెక్టివిటీ, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా నియంత్రణ మరియు అంకితమైన టోల్- ఫ్రీ నంబరు 99100-99100 కాల్ మరియు వాట్సాప్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, అంతర్జాతీయ ఔట్‌రోమర్‌ల కోసం యాక్టివేషన్‌ను సులభతరం చేసే ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఎయిర్‌టెల్ డ్యూటీ ఫ్రీ ఏరియాలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్‌లో కియోస్క్‌ను ఏర్పాటు చేసింది.
ఎయిర్‌టెల్ (Airtel) ఐఆర్ ప్లాన్‌లో కీలక అంశాలు..
ప్రపంచంలో అత్యంత సరసమైన ప్లాన్‌లలో ఒకటి..
ఎయిర్‌టెల్ ఐఆర్ ప్లాన్ చాలా సరసమైనది మరియు ఇది చాలా దేశాల స్థానిక సిమ్‌ల కన్నా మరింత సౌకర్యవంతంగా మరియు పొదుపుగా ఉండేలా చేయడం ద్వారా రోజుకు రూ.133 ఖర్చు అవుతుంది.
వినియోగదారులు తీసుకోవలసిన ఏకైక నిర్ణయం వ్యవధి..
వినియోగదారులు తమ ప్రయాణ వ్యవధిని 1 రోజు నుంచి 90 రోజుల వరకు ఎంచుకోవాలి లేదా ఎన్‌ఆర్‌ఐల కోసం వార్షిక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ని కూడా ఎంచుకోవచ్చు. ఇది ప్రయాణికుని అవసరానికి అనుగుణంగా అందరికీ సౌకర్యవంతంగా, మరింత పొదుపును అందిస్తుంది.
అన్‌లిమిటెడ్ ఎమర్జెన్సీ కనెక్టివిటీ..
వినియోగదారులు తమ డేటా పరిమితిని పూర్తి చేసుకున్నప్పటికీ మెసేజింగ్, ఇ-మెయిల్‌లు మరియు వెబ్ బ్రౌజింగ్ వంటి ముఖ్యమైన సేవలు పని చేస్తూనే ఉంటాయి. అవి ఎప్పటికీ డిస్‌కనెక్ట్ కావని హామీ ఇస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్, ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా కూడా టాప్-అప్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
వినియోగదారుల చేతిలో నియంత్రణ..
ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా, వినియోగదారులు తమ ప్లాన్‌లను సులభంగా మేనేజ్ చేయవచ్చు, సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు, ప్లాన్‌ని మార్చవచ్చు, అదనపు డేటాను కొనుగోలు చేయవచ్చు మరియు తాము చేరుకున్న దేశంలో దిగిన తర్వాత అంతర్జాతీయ రోమింగ్‌ని యాక్టివేట్ చేయవచ్చు.
అంతటా ఒకే నంబర్..
వినియోగదారులు ఒకే నంబర్‌లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయి ఉండగలరు మరియు వారి బ్యాంకులు, హోటల్‌లు మరియు విమానయాన సంస్థల నుంచి అప్‌డేట్‌లను అందుకునేందుకు అవకాశం ఉంటుంది.
భద్రత..
ఎయిర్‌టెల్ ఐఆర్ ప్యాక్‌తో, కొత్త సిమ్ కోసం వినియోగదారులు తమ ప్రైవేట్ పత్రాలను స్థానిక షాపర్లకు బహిర్గతం చేయడాన్ని నివారించవచ్చు. వారు అదే నంబర్‌లో ఉండటం ద్వారా మోసపూరిత బ్యాంకింగ్ లావాదేవీల నుంచి తమను తాము రక్షించుకోవచ్చు.
24×7 అంకితమైన ట్రబుల్‌షూటింగ్ మద్దతు..
ఎయిర్‌టెల్ ప్రతిచోటా అందుబాటులో ఉన్న టోల్-ఫ్రీ నంబర్ +91 99100-99100 ద్వారా అంకితమైన మద్దతును అందిస్తుంది. అనుభవజ్ఞులైన ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సహాయాన్ని స్వీకరించుందకు వినియోగదారులు వాట్సప్ ద్వారా కాల్ చేయవచ్చు లేదా సందేశం పంపవచ్చు.
మరింత సమాచారం కోసం, దయచేసి https://www.airtel.in/ir-packsని సందర్శించండి