Site icon Prime9

Jet Fuel price: 2.2 శాతం తగ్గిన జెట్ ఇంధనం ధరలు

New Delhi: అంతర్జాతీయ చమురు ధరల పతనాన్ని ప్రతిబింబిస్తూ జెట్ ఇంధనం ( ఎటిఎఫ్ ) ధరలు 2.2 శాతం తగ్గాయి. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు కిలోలీటర్‌కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గించి కిలోలీటర్‌కు రూ. 138,147.93కి తగ్గాయి. ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. ధరలు గత నెలలో కిలోలీటర్‌కు రూ. 141,232.87 (లీటర్‌కు రూ. 141.23)కు చేరుకున్నాయి.

అంతర్జాతీయ చమురు ధరల రేట్ల ఆధారంగా ఎటిఎఫ్ ధరలు ప్రతి నెలా 1వ మరియు 16వ తేదీల్లో సవరించబడతాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 11 సార్లు రేట్లు పెంచబడ్డాయి. దీంతో ఆరు నెలల్లో దాదాపు రెట్టింపు ధరలు పెరిగాయి. జనవరి 1 నుండి ధరలు 91 శాతం (కేఎల్‌కు రూ. 67,210.46) పెరిగాయి.విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం జెట్ ఇంధనంతో ఉండటంతో, ధరల పెరుగుదల కారణంగా విమానయాన ఖర్చులు పెరిగాయి.

Exit mobile version