Site icon Prime9

Zelio X-Men 2.0 Electric Scooter: పరుగెత్తే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రూ. 71 వేలకే సొంతం చేసుకోండి.. యూత్‌కు పర్ఫెక్ట్ బండి..!

Zelio X-Men 2.0 Electric Scooter

Zelio X-Men 2.0 Electric Scooter

Zelio X-Men 2.0 Electric Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ZELIO Ebikes తన కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0ని దేశీయ విపణిలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-మెన్ సిరీస్‌కి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లు, టెక్నాలజీని ఉపయోగించారు. ఇది మునుపటి మోడల్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.71,500 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

సామాన్యుల రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చగలిగే విధంగా ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. పాఠశాల-కాలేజీ విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లేవారు లేదా సిటీ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ స్కూటర్‌ను రూపొందించింది. కంపెనీ ఈ స్కూటర్‌ను లీడ్-యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లతో నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో పరిచయం చేసింది. వీటి ధరలు కూడా భిన్నంగా ఉంటాయి.

బ్యాటరీ కెపాసిటీ – ధర (ఎక్స్-షోరూమ్)
60V 32AH లీడ్-యాసిడ్ రూ. 71,500
72V 32AH లెడ్-యాసిడ్ రూ. 74,000
60V 30AH లిథియం-అయాన్ రూ. 87,500
74V 32AH లిథియం-అయాన్ రూ. 91,500

X-MEN 2.0 డిజైన్, లుక్ చాలావరకు మునుపటి మోడల్‌తో సమానంగా ఉంటుంది. అయితే అందులో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసింది కంపెనీ. తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది 60/72V కెపాసిటీ గల BLDC ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 100 కిమీ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.  దీని టాప్-స్పీడ్ గంటకు 25 కిమీ అని కంపెనీ పేర్కొంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 1.5 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుందని ZELIO పేర్కొంది. మీరు ఢిల్లీలో ఈ స్కూటర్‌ను ఉపయోగిస్తే, 0-200 యూనిట్ల విద్యుత్‌కు యూనిట్‌కు సుమారు రూ. 3 నుండి రూ. 4.16 వరకు ఉంటుంది. యూనిట్‌కు సగటున రూ.5గా పరిగణించినా 1.5 యూనిట్ల విద్యుత్‌కు గరిష్టంగా రూ.7.5 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ. 7.50 పైసలకే మీరు దాదాపు 100 కి.మీల డ్రైవింగ్ రేంజ్ ప్రయోజనాన్ని పొందుతారు.

90 కిలోల ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 180 కిలోల వరకు లోడ్ (పేలోడ్) మోయగలదు. అంటే ఇద్దరు వ్యక్తులు సులభంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఇది రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో విడుదలైంది. లిథియం బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 4 నుండి 5 గంటలు, లీడ్-యాసిడ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 8 నుండి 10 గంటల సమయం పడుతుంది.

Zelio X-Men 2.0 Features
X-MEN 2.0లో కంపెనీ కొన్ని ప్రత్యేక ఫీచర్లను చేర్చింది. ముందు, వెనుక డిస్క్ బ్రేకులు కాకుండా ఇది ముందు భాగంలో అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. వెనుక చక్రం హబ్ మోటార్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ అందుబాటులో ఉంది. వెనుక భాగంలో స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది కాకుండా యాంటీ థెఫ్ట్ అలారం, పార్కింగ్ స్విచ్, రివర్స్ గేర్, USB ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ డిస్‌ప్లే, ఆటో-రిపేర్ స్విచ్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌ను మెరుగ్గా మార్చాయి. ఈ స్కూటర్‌పై కంపెనీ 10,000 కి.మీల వరకు వారంటీ ఇస్తోంది.

కంపెనీ X-MEN 2.0ని మొత్తం నాలుగు వైబ్రెంట్ కలర్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది. ఇందులో గ్రీన్, వైట్, సిల్వర్, రెడ్ కలర్స్‌లో ఉంటాయి. ZELIO Ebikes సహ-వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ.. కొత్త X-MEN 2.0ని డిజైన్‌లో తీసుకొచ్చింది. ఇంజినీరింగ్‌తో పాటుగా తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Exit mobile version