Site icon Prime9

Xiaomi YU7 SUV: షియోమీ నుంచి కత్తిలాంటి కార్.. ఫుల్ ఛార్జ్‌పై 800 కిమీ రేంజ్.. డిజైన్ వేరే లెవల్‌లో ఉంది..!

Xiaomi YU7 SUV

Xiaomi YU7 SUV

Xiaomi YU7 SUV: చైనీస్ టెక్ కంపెనీ షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ YU7 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ కారును వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలలో చైనాలో విడుదల చేయవచ్చు. ఈ కారు చైనీస్ మార్కెట్లో విక్రయించే టెస్లాతో నేరుగా పోటీపడుతుంది. షియోమీ ఈ ఎలక్ట్రిక్ కారును ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే ఆలోచన లేదు. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం షియోమీ ఇండియన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దీని గురించి వివరిస్తూ ఇది సులభమైన వ్యాపారం కాదని తెలిపారు. కంపెనీ  ప్రారంభ దృష్టి మొదట చైనా మార్కెట్‌లో ఉంటుంది, ఆ తర్వాత మాత్రమే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

షియోమీ YU7 ఎలక్ట్రిక్ SUV డిజైన్ గురించి మాట్లాడితే ఇది అందంగా డిజైన్ చేసిన వీల్స్ కలిగి ఉంటుంది. ఇది దాని లుక్‌ను మరింత స్టైలిష్‌గా చేస్తుంది. SU7 మాదిరిగానే LED టెయిల్ ల్యాంప్‌లు దీని వెనుక భాగంలో ఉంటాయి. Xiaomi SU7 దాదాపు 5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రీమియం సెడాన్, అయితే టాప్-ఎండ్ వేరియంట్‌లో డ్యూయల్ మోటార్ సెటప్ ఉంది. ఇది 101 kWh పెద్ద Qilin బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.

చైనాలో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. YU7 SUV డ్యూయల్-మోటార్ సెటప్‌తో అందించారు – 299hp (ముందు) మరియు 392hp (వెనుక), ఇది 691hp  మిశ్రమ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. హై-స్పెక్ SU7 673hp మాక్స్ వేరియంట్ కంటే పవర్‌ ఫుల్ ఈ సెటప్, 2,405kg (కర్బ్ వెయిట్) SUVని 253kph గరిష్ట వేగానికి తీసుకెళ్లగలదు. SU7 మాక్స్ 200కిలోల తేలికైనది. 265కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే దాదాపు 800కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. డ్యూయల్ మోటార్ సెటప్‌తో, ఈ కారు గరిష్టంగా 600 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. SU7 ఎంట్రీ-లెవల్ RWD వేరియంట్ LFP-కెమిస్ట్రీ బ్యాటరీలను ఉపయోగిస్తుంది. టూ-వీల్-డ్రైవ్ వెర్షన్ అందుబాటులోకి వస్తే అదే యూనిట్‌ని Xiaomi YU7లో ఉపయోగించవచ్చు. భారతదేశం విషయానికి వస్తే, ఇది BYD సీల్‌తో పోటీపడగలదు. షియోమీ ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్, పవర్‌తో కూడిన స్వూపీ డిజైన్‌ను అందించింది. అలాగే, ఇది ఏరో ఎఫెక్టివ్‌గా ఉండబోతోంది.

Exit mobile version