Solar Car: భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 కొన్ని ఆసక్తికరమైన వాహనాలను చూసింది. అందులో భారతదేశపు తొలి సోలార్ కారు వేవ్ ఎవా కూడా ఒకటిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. కారు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. అదనంగా ఛార్జ్ అయిపోయినప్పుడు సౌరశక్తితో పనిచేయడానికి సౌర ఫలకాలను అమర్చారు. ఈ 2-సీటర్ కారును ఆటో ఎక్స్‌పోలో రూ. 3.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు.
వేవ్ ఎలక్ట్రిక్ ఎవా కారు, భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. మూడు వేరియంట్లలో వస్తుంది. వాటిని పరిశీలిస్తే, వేవ్ ఎవా నోవా,వేవ్ ఎవా స్టెల్లా, వేవ్ ఎవా వేగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి వేరియంట్లో ఉన్న ఫీచర్లను తెలుసుకుందాం.
వేవ్ ఎవా నోవా
వేవ్ ఎవా నోవా వేరియంట్ 9 kW (ఎయిర్ కూల్డ్) బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది, ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 125 కి.మీ వరకు పరుగెడుతుంది. 10 నుండి 90 శాతం ఛార్జ్ (హోమ్ ఛార్జర్) 5 గంటల్లో చేయవచ్చు. రీజెన్ బ్రేకింగ్ కూడా ఉంది.
ఫీచర్లు కీ స్టార్ట్ అండ్ స్టాప్, సింగిల్ డ్రైవ్ మోడ్ (ఎకో), 12 – ఇంచ్ స్టీల్ వీల్స్, 60 కెఎమ్‌పిహెచ్ టాప్ స్పీడ్, హాలోజన్ హెడ్లైట్లు, మాన్యువల్ డే అండ్ నైట్ ఐఆర్విఎమ్. ఈ ఫీచర్లన్నీ వేవ్ ఎవా నోవా వేరియంట్లో అందుబాటులో ఉంటాయి.
వేవ్ ఎవా స్టెల్లా
వేవ్ ఎవా స్టెల్లా వేరియంట్ 12.6 kW ఎయిర్-కూల్డ్ బ్యాటరీతో రన్ అవుతుంది. పూర్తి ఛార్జింగ్‌తో బ్యాటరీని 175 కిలోమీటర్లు నడపవచ్చు. 5 గంటల్లో కాన్ఫిగర్ చేయగల రీజెనరేటివ్ బ్రేకింగ్, 10-90శాతం ఛార్జ్ చేయచ్చు.
అలాగే ఈ వేరియంట్ 60 కిమీ/గం టాప్ స్పీడ్, రెండు డ్రైవ్ మోడ్లు (ఎకో, సిటీ), పనోరమిక్ గ్లాస్ రూఫ్, క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 2-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టార్ట్-స్టాప్ బటన్, 13-అంగుళాల స్టీల్ వీల్స్, ఎల్ఈడీ హెడ్ లైట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, కెమెరా, ఆటో-డిమ్మింగ్ ఐఆర్విఎమ్ ఉన్నాయి.
వేవ్ ఎవా వేగా
వేవ్ ఎవా వేగా వేరియంట్ 18kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీతో దూసుకెళుతుంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌తో 250 కిమీ. గంటకు 70 కిమీ. అత్యధిక వేగంతో ఉన్న ఈ కారు 5 గంటల్లో 10-90శాతం ఛార్జ్ చేయగలదు.
ఇప్పుడు డీసి ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో 10-70శాతం ఛార్జ్ చేయవచ్చు. ఇందులో మూడు డ్రైవ్ మోడ్లు ఎకో, సిటీ, స్పోర్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎయిర్ బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.