Volkswagen Electric: వోక్స్‌వ్యాగన్ తన కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. వచ్చే నెలలో ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.అయితే ఈ కారు సేల్‌కి వచ్చే దానికి ఇంకా సమయం ఉంది. కంపెనీ ఈ కారు ఫోటోను షేర్ చేసింది. అందులో దాని ఫ్రంట్ లుక్ వివరాలను చూడొచ్చు. ఫోటో ప్రకారం.. వెహికల్ ముందు నుండి స్మార్ట్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును 2030 నాటికి ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. ధర గురించి మాట్లాడితే, వోక్స్‌వ్యాగన్ ఈ ఎలక్ట్రిక్ కారు ధర దాదాపు 20,000 యూరోల (సుమారు రూ. 18 లక్షలు) నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ ధర అంచనా మాత్రమే. దేశీయ మార్కెట్లో ఈ కారు ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
Volkswagen Electric Speciality
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. వోక్స్‌వ్యాగన్ ఈ ఎలక్ట్రిక్ కారు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో రానుంది. దీని పరిమాణం కాంపాక్ట్‌గా ఉంటుంది. సిటీ డ్రైవ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారుకు ఎలాంటి పేరు పెట్టలేదు. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ కారు ID 1 అని పేరు పెట్టవచ్చు. కొన్ని ఇతర నివేదికలలో కంపెనీ ఈ కారును 2027లో కూడా తీసుకురాగలదని సూచిస్తున్నాయి.
ఈ కారు కంటే ముందు, వోక్స్‌వ్యాగన్ 2026 నాటికి తన మొదటి చిన్న ఎలక్ట్రిక్ కారుగా ID 2allను పరిచయం చేయవచ్చని ఒక నివేదిక పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారు బ్రాండ్ కొత్త MEB ప్లాట్‌ఫామ్‌లో డెవలప్ చేస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కారులో క్రాస్ఓవర్ లేదా ఎస్‌యూవీ పరిమాణం చూడవచ్చు.
Volkswagen Electric Battery And Range
సమాచారం ప్రకారం.. రాబోయే ఎలక్ట్రిక్ కారులో పెద్ద బ్యాటరీతో ఫ్రంట్-వీల్ డ్రైవ్ మోటార్ సెటప్ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు, అయితే దీని రేంజ్ 350-450 కిలోమీటర్లు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఇందులో ఫాస్ట్ డీసీ, ఏసీ ఛార్జింగ్ ఫీచర్‌ను అందించవచ్చు. ఇప్పుడు కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో ఏ పేరుతో, రేంజ్‌తో వస్తుందో చూడాలి. ముఖ్యంగా, ఇది ఏ ధరకు తీసుకురాబడుతుంది? ఇది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే రానున్న కాలంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే మార్కెట్‌ను శాసిస్తాయి.