2024 River Indie: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ రివర్ తన ఇండీ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రారంభించింది. 2024 రివర్ ఇండీ ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రివర్ ఇండీని తొలిసారిగా 2023లో రూ. 1.25 లక్షల ధరతో ప్రారంభించగా, ఈ ఏడాది ప్రారంభంలో వాహనం ధరను రూ.1.38 లక్షలకు పెంచారు. దాని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2024 River Indie Specifications
రివర్ ఇండీ దాని పెద్ద బాడీవర్క్, ట్విన్-బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, ప్యానియర్‌ల కోసం సైడ్స్ ఇంటిగ్రేటెడ్ హార్డ్ మౌంట్‌లతో అదే డిజైన్‌తో కొనసాగుతుంది. చంకీ సీటు, ఫ్లాట్, వెడల్పాటి ఫ్లోర్‌బోర్డ్, గ్రాబ్రెయిల్‌లు, క్రాష్ గార్డ్‌లు, మందపాటి టైర్‌లతో చుట్టిన అల్లాయ్ వీల్స్ ట్రెడిషినల్ స్కూటర్లు ICE లేదా ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోలిస్తే దాని స్ట్రాంగ్ లుక్, యాక్టివిటీని మరింతగా పెంచుతాయి.
ఇండీలో 55 లీటర్ల స్టోరేజ్ ఉంది. ఇందులో గ్లోవ్‌బాక్స్‌లో 12 లీటర్లు, అండర్ సీట్ స్టోరేజీలో 43 లీటర్లు ఉన్నాయి. ఇది కాకుండ ఇది ఫ్రంట్-ఫుట్‌పెగ్‌లు, 14-అంగుళాల వీల్స్‌తో ఉంటుంది. రివర్ ఇండీలో 6.7kW (8.9 bhp) ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 26Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 90కిమీగా కంపెనీ పేర్కొంది. అయితే 4kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్‌పై 120కిమీల పరిధిని అందిస్తుంది.
స్టాండర్డ్ ఛార్జర్‌ని ఉపయోగించి ఇండీని 5 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని రివర్ చెబుతోంది. ఇది ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడ్ మోడ్‌లను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిమీ. పరిధి అందుబాటులో ఉంది. రివర్ ఇండీకి చేసిన అతిపెద్ద అప్‌డేట్ చైన్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన కొత్త సింగిల్ స్పీడ్ గేర్‌బాక్స్. ఈ విభాగంలో ఇదే మొదటిదని కంపెనీ పేర్కొంది.
దీంతో మొత్తం ఖర్చు తగ్గిందని, మన్నిక పెరిగిందని కంపెనీ పేర్కొంది. సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడిన చైన్ డ్రైవ్, స్కూటర్ అసెంబ్లీంగ్, మరమ్మత్తు పని రెండింటినీ సులభతరం చేస్తుందని రివర్ వద్ద మెకానికల్ డిజైన్ హెడ్ మజర్ అలీ బేగ్ మీర్జా తెలిపారు. ఇది కాకుండా రివర్ ఇండీ ఇప్పుడు 2024 అప్‌డేట్‌తో వింటర్ వైట్, స్టార్మ్ గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లతో వస్తుంది.